బెల్లంకొండ శ్రీనివాస్ కోసం అచ్చంగా దించేశారే..

బెల్లంకొండ శ్రీనివాస్.. ముందు నుంచీ మాస్ హీరో కావాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే యాక్షన్ కు ఇంపార్టెన్స్ ఉండే సినిమాలే సైన్ చేశాడు. రిజల్ట్ తో పనిలేకుండా మాస్ లోకి వెళ్లే కథలే ఎంచుకుంటున్నాడు. అయితే అతని సినిమాలు తెలుగులో పెద్ద హిట్స్ కావడం లేదు కానీ.. డబ్బింగ్ రూపంలో నార్త్ లో మాత్రం అదరగొడుతున్నాయి.

శ్రీనివాస్ సినిమా అంటే నార్త్ ఇండియాలతో తిరుగులేని క్రేజ్ ఉంది. రీసెంట్ గానే జయజానకి నాయక చిత్రం యూ ట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేసింది. హిందీ వెర్షన్ లో అక్కడ జనాలు యూ ట్యూబ్ లో విపరీతంగా చూస్తున్నారీ చిత్రాన్ని. అది ఏకంగా వరల్డ్ రికార్డ్ కావడం విశేషం. ఇప్పటి వరకూ జయ జానకి నాయక మూవీకి 709(70.90 కోట్లు) వ్యూస్ వచ్చాయి. గతంలో ఈ రికార్డ్ 702మిలియన్ వ్యూస్ తో కెజీఎఫ్ చిత్రంపై ఉండేది. రీసెంట్ గా ఆ రికార్డ్ ను మన శ్రీనివాస్ ఛేదించాడు.


ఇక రాక్షసుడు వంటి బ్లాక బస్టర్ అందుకున్న తర్వాత వచ్చిన అల్లుడు అదుర్స్ థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచింది. దీంతో చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో వివి వినాయక్ డైరెక్షన్ లో తెలుగు ఛత్రపతిని హిందీలో రీమేక్ చేస్తున్నాడు అని వార్తలు వచ్చాయి. బట్ ఈ న్యూస్ కూడా కొన్నాళ్ల పాటు లైమ్ లైట్ లో లేదు. దీంతో ఈ మూవీ ఆగిపోయింది అనుకున్నారు చాలామంది. బట్ సడెన్ గా తమ చిత్రాన్ని మే 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. లేటెస్ట్ గా శ్రీరామ నవమి సందర్భంగా ఏకంగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే చాలా వరకూ ఛత్రపతి షాట్స్ నే అచ్చంగా దించేసినట్టు కనిపిస్తోంది.

అంటే ఛత్రపతి వచ్చి చాలాకాలం అయింది కాబట్టి.. ఈ కథలో ఏమైనా మార్పులు ఉంటాయోమో అని భావించారు. బట్ పెద్దగా మార్పులేం లేకుండానే రీమేక్ పూర్తి చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని పెన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ సరసన నూస్రత్ భారూచా హీరోయిన్ గా నటిస్తోంది. కాకపోతే ఈ టీజర్ లో ఈ బ్యూటీకి స్పేస్ ఇవ్వలేదు. మిగతా ఆర్టిస్టులు కూడా బాలీవుడ్ నుంచే తీసుకున్నారు. మొత్తంగా శ్రీనివాస్ ఈ చిత్రంతో బాలీవుడ్ లో పాగా వేసినా ఆశ్చర్యం లేదేమో.

Related Posts