వివాహ భోజనంబు ఓటీటీ రైట్స్ వెనకున్న అసలు కథ ఇదే
Latest Movies OTT Tollywood

వివాహ భోజనంబు ఓటీటీ రైట్స్ వెనకున్న అసలు కథ ఇదే

కమెడియన్ సత్య మెయిన్ లీడ్ గా సందీప్ కిషన్ నిర్మిస్తున్న చిత్రం వివాహభోజనంబు. ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వున్నప్పటికీ.. వేగంగా కంప్లీట్ చేసేశారు. రామ్ అబ్బరాజ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. స్వామిరారా సినిమాతో టర్నింగ్ పాయింట్ తీసుకున్న సత్య ఎన్నో సినిమాల్లో కామెడీని పండిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే… ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమ్మేశారని తెలిసింది. ఇంతకీ ఎవరు కొన్నారంటే.. ఈ చిత్రం పూర్తవ్వగానే సోని లైవ్ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ తీసుకున్నట్టు తెలిసింది.

అయితే.. అఫీషియల్ గా సమాచారం రావలసి వుంది. ఈ సినిమా హాట్ కేక్ లా అయిపోవడానికి కూడా కారణం వుంది. సోనీ ఓటీటీ సంస్థ తెలుగు సినిమాలకు హెడ్ గా మధురా శ్రీధర్ వున్నారు. అయితే.. ‘స్నేహగీతం’ నుంచి మధుర శ్రీధర్ కు సందీప్ కిషన్ కు మంచి అనుబంధం వుంది. ఈ చిత్రాన్ని సందీప్ కిషన్ నిర్మించాడు. కాబట్టి పెద్ద పబ్లిసిటీ లేకపోయినా తొందరగా లైన్ క్లియర్ అయ్యింది. వడ్డించే వాడు మనవాడైతే వరుసలో ఎక్కడ కూర్చున్నా భయముండదు అనే సామెత గుర్తొస్తోంది అని కొంత మంది నిర్మాతలు చెవులు కొరుక్కుంటున్నారు.

Post Comment