స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే కథ విషయంలో అందరిలోనూ ఓ క్యూరియాసిటీ ఉంటుంది. కథ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ ముందే కథలు తెలిసిపోతే సినిమా చూస్తున్నప్పుడు కిక్ ఉండదు కదా..? బట్ కొన్నిసార్లు ఎంత దాచాలనుకున్నా.. కథలు దాగవు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాకు సంబంధించి వచ్చిన ఓ చిన్న లీక్ వల్ల కథ ఇదేనంటూ కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
” దేవర” సినిమాలో ఎన్టీఆర్ ఓ ఫిషర్ మేన్ లా కనిపించబోతున్నాడు. తన వాల్లతో కలిసి పోటెత్తెసముద్రంలోకి వెళ్లి చేపలు పట్టుకుని వస్తుంటాడు. ఈ క్రమంలో అతను అత్యంత సాహసాలు కూడా చేస్తాడట. ఆ సాహసాలు చూసే తన తోటి ఫిషర్ మేన్ కూతురైన జాన్వీ కపూర్ అతనితో ప్రేమలో పడుతుంది. అయితే తను ఫిషర్ మేన్ అయినా.. తమ్ముడిని కోస్ట్ గార్డ్ ను చేస్తాడు ఎన్టీఆర్.
అన్ని ఇచ్చిన ఉత్సాహం, నిజాయితీతో కోస్ట్ గార్డ్ గా వెళ్లిన తమ్ముడు ఒక ముఠా చేస్తోన్న అరాచకాలను గుర్తించి ప్రభుత్వానికి చెప్పాలనుకుంటాడు. ఈ క్రమంలో అతను వినడానికి కూడా ఒళ్లు జలదరించే విషయాలు తెలుసుకుంటాడు. తమ గురించి తెలిసిన ఆ యంగ్ స్టర్ ను వాళ్లు అత్యంత కిరాతకంగా చంపేస్తారు. కానీ ఈ విషయాన్ని ఎలాగోలా అన్నకు తెలిసేలా చేస్తాడు తమ్ముడు.తమ్ముడు చెప్పిన ఆనవాలుతో వెళ్లి సముద్రం మాటున ఆ మానవమృగాలు సాగిస్తోన్న అరాచకాలను ప్రభుత్వానికి చెప్పడం కాదు.. అసలుకే అంతం చేయాలని వాళ్లను చంపేస్తాడు. కానీ అప్పుడే అతనికి మరో పెద్ద విషయం తెలుస్తుంది. అదే ఈ సినిమాలో హైలెట్ గా నిలవబోతోంది. ఆ రహస్యాన్ని అంతం చేయడం ద్వారా అతను లక్షలమంది ప్రజలకు దేవరగా నిలుస్తాడు..
మరి పెద్ద విషయం ఏంటోకూడా చెబితే బావుండదు కాబట్టి ప్రేక్షకుల ఊహకే వదిలేస్తున్నాం.. “
ఇదీ ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా కథ అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమా కాదా అనేది సినిమా వస్తే కానీ తెలియదు. బట్.. ప్రస్తుతానికైతే.. ఎన్టీఆర్ తమ్ముడు పాత్రలో.. కోస్ట్ గార్డ్ గా నటించే కుర్రాడి కోసం టాలీవుడ్ లోని ఓ యంగ్ హీరోను తీసుకోబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అది నిజం కూడా. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తోపాటు మరో యంగ్ హీరో కూడా నటించబోతున్నాడు. మొత్తంగా ఈ పాయింట్ ను కొరటాల శివ స్టైల్ లో చెబితే మాస్ కు పూనకాలు గ్యారెంటీ అని చెప్పొచ్చు.