వీక్ డేస్ లో వీక్ అయిన బంగార్రాజు

అక్కినేని నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన బంగార్రాజు సంక్రాంతి సందర్భంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కొంత వరకూ ప్రతికూల పరిస్థితులు ఉన్నా.. బంగార్రాజు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు. ఫస్ట్ వీకెండ్ లోనే నాగ్, చైతూ కెరీర్ లో హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించిన పరిశ్రమను సైతం ఆశ్చర్యపరిచిందీ చిత్రం. నిజానికి బంగార్రాజు మూవీ ఫస్ట్ హాఫ్ చాలా వీక్ గా ఉంటుంది. ఇంకా చెబితే చాలా బోరింగ్ కూడా. సెకండ్ హాఫ్ లోనే మాగ్జిమం సినిమా మెప్పిస్తుంది. అందుకే ఈ విజయం. ఇంక ఫస్ట్ హాఫ్ కూడా బావుండి ఉంటే కలెక్షన్స్ ఇంకా చాలా మెరుగ్గా ఉండేవని అంతా చెప్పుకున్నారు. అయినా మరోసారి నాగ్ కెరీర్ లోనే హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ 65కోట్ల వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే బంగార్రాజు విడుదలైన పది రోజుల వరకూ ఇంకా థియేటర్స్ లో ఉంది. కానీ ఆ రేంజ్ లో కలెక్షన్స్ కనిపించకపోవడం విశేషం.
ఆంధ్రలో ప్రస్తుతం థియేటర్స్ లో 50శాతమే ఆక్యుపెన్సీ ఉంది.అయినా అక్కడ కలెక్షన్స్ చాలా వరకూ మెరుగ్గా ఉంటే.. తెలంగాణలో మాత్రం బంగార్రాజు ఫస్ట్ వీకెండ్ తర్వాత తేలిపోయాడు. ఇక వీక్ డేస్ లో చాలా వీక్ అయిపోయాడు. వీక్ డేస్ లో ఆంధ్రలో కూడా వీక్ గా ఉందీ చిత్రం. అందుకు కారణం ముందే చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ గా ఉండటమే అనుకోవచ్చు. పేరుకు పది రోజుల పోస్టర్ పడుతుంది కానీ.. ఆ స్థాయిలో కలెక్షన్స్ లేవనేది నిజం. ఆంధ్రలో చాలా వరకూ కొన్నవాళ్లంతా సేఫ్ అయినా.. నైజాంలో మాత్రం ఇంకా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కు రావాల్సి ఉంది. అయితే అదేమంత భారీగా లేదనేది ట్రేడ్ టాక్. అయినా సినిమా సేఫ్ అయినట్టే అనుకోవచ్చు. మొత్తంగా బంగార్రాజు దూకుడ�