బంగార్రాజు సైలెంట్ గా కొట్టేలా ఉన్నాడే

అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తోన్న చిత్రం బంగార్రాజు. 2015లో వచ్చిన నాగార్జున సోగ్గాడే చిన్నినాయనాకు సీక్వెల్ గా వస్తోన్న మూవీ ఇది. అందుకే నాగ్ కు రమ్యకృష్ణ పెయిర్ గా నటిస్తుండగా.. చైతూ కోసం లేటెస్ట్ సెన్సేషనల్ బ్యూటీ కృతిశెట్టిని తీసుకున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చింది. చాలారోజుల క్రితమే బంగార్రాజును సంక్రాంతి బరిలో జనవరి 15న విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. అయితే మధ్యలో ఆర్ఆర్ఆర్ రావడంతో అప్పుడు అనౌన్స్ అయిన కొన్ని పెద్ద సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాయి. దీంతో బంగార్రాజు కూడా బరిలో నిలవడం కష్టం అనుకున్నారు. బట్.. వీళ్లు సంక్రాంతి వార్ కు సై అంటున్నారని టాక్. వీరికంటే ముందే భీమ్లానాయక్ ఉన్నాడు.
కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ స్క్రిప్ట్ ఓ పట్టాన వర్కవుట్ కాలేదు. చాలా వెర్షన్స్ తర్వాత ఓకే చెప్పాడు నాగార్జున. అంటే పూర్తిగా తనకు కాన్ఫిడెన్స్ వచ్చాకే మొదలుపెట్టారన్నమాట. అన్నపూర్ణ బ్యానర్ లోనే రూపొందుతోన్న ఈ చిత్రం సంక్రాంతి బరిలో సత్తా చాటడం గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు భీమ్లా నాయక్ ను కూడా పోస్ట్ పోన్ చేయించాలని దిల్ రాజు పట్టుదలగా ప్రయత్నిస్తున్నాడు. ఒకవేళ ఆ సినిమా పోస్ట్ పోన్ అయితే మిగిలేది ఆర్ఆర్ఆర్ తో పాటు రాధేశ్యామ్. రాధేశ్యామ్ పై ఇంత వరకూ ఏ అంచనాలూ మొదలుకాలేదు. ఆర్ఆర్ఆర్ విడుదలై అప్పటికే వారం అవుతుంది. దీంతో బంగార్రాజుకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా సులువుగా గట్టెక్కేస్తుంది. మరోవైపు ఈ చిత్రంలో జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లాతో ఓ ఐటమ్ సాంగ్ చేయించారు. ఈ ఆదివారం ఆ పాట విడుదల కాబోతోంది. ఆల్రెడీ విడుదలైన ప్రోమోనే దుమ్మురేపుతోంది. వాళ్లే చెప్పినట్టుగా 2022కి పార్టీ సాంగ్ గా మారే అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తంగా బంగార్రాజు సైలెంట్ గా సక్సెస్ కొట్టేలా కనిపిస్తున్నాడు.

Related Posts