నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. అఖండతో రోరింగ్ హిట్ అందుకున్నాడు. ఇటు అన్ స్టాపబుల్ షోతో దెబ్బకు అందరి థింకింగ్ మార్చేశాడు.

ఏకంగా సెకండ్ సీజన్ ను కూడా జోష్‌ గా కంటిన్యూ చేస్తున్నాడు. ఇక ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డిగా రాబోతున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

అంతకు ముందు గోపీచంద్ కూడా క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి ఉండటం అందుకు మరో కారణం. శ్రుతి హాసన్, హనీరోజ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే వచ్చిన పాటలు మాస్ క్లాస్ ను ఊపేస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా ఈ చిత్రం నంచి మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ మరో మాస్ ఐటమ్ ను వదిలారు.


టైటిల్ కు తగ్గట్టుగానే పాట మాస్ ను థియేటర్ లో కుదురుగా కూర్చోనిచ్చేలా కనిపించడం లేదు. ఇదే విషయాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ట్వీట్ చేశాడు.

థియేటర్స్ లో జనాన్ని ఊపేయడానికే ఈ పాటను ప్లాన్ చేసుకున్నా అని ట్వీట్ చేశాడు. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ గీతానికి తగ్గట్టుగానే మాస్ బీట్స్ తో మెప్పించాడు తమన్.

పాటగా చూస్తే తన బావ రమ్మనగానే వెళ్లడంలో ఆలస్యం చేసిన ఓ యువతిపై అతను అలక బూనుతాడు. అతన్ని బుజ్జగిస్తూ.. అతను అలగడానికి కారణం తనే అనేలా అతనికి ఇష్టం లేని వన్నీ చేశానని చెప్పుకుంటూనే ఆ పడతి పాడుకునే పాటలా కనిపిస్తోంది. మొత్తంగా ఈ సంక్రాంతి బరిలో జనవరి 12న భారీగా రాబోతోన్న వీర సింహారెడ్డితో బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడేలా కనిపిస్తోంది.