బింబిసార.. 2022 ఆగస్ట్ 5న విడుదలైన ఈ మూవీకి యూనానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సోషియో ఫాంటసీగా వచ్చిన ఈ మూవీలో కళ్యాణ్‌ రామ్ నటన కూడా అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. ఆ కాలపు బింబిసారుడుగా క్రూరత్వాన్ని.. ఆధునిక కాలంలోకి అనుకోకుండా వచ్చిన బింబిసారుడు మారిపోయి మళ్లీ కరుణను పలికించడం అనే అంశాలు ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి.

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కూడా యాప్ట్ గా ఉండటంతో ఆ పాయింట్ కూడా మెప్పించి.. బాక్సాఫీస్ వద్ద బింబిసారుడు బ్లాక్ బస్టర్ అయ్యాడు. అప్పటి నుంచీ ఈ చిత్ర దర్శకుడు వశిష్ట గురించి రకరకాల వార్తలు వచ్చాయి. నెక్ట్స్ ఫలానా హీరోతో సినిమా చేయబోతున్నాడు అంటూ న్యూస్ వినిపించాయి. ఓ దశలో సూపర్ స్టార్ రజినీకాంత్ తోనూ సినిమా చేస్తున్నాడు అన్నారు.

అందుకు తగ్గట్టుగానే ఆయనకీ కథ చెప్పాడు. మరి ఆ ప్రాజెక్ట్ ఏమైందో కానీ ఇప్పుడు బాలకృష్ణు ఒప్పించాడు అంటున్నారు. ప్రస్తుతం బాలయ్య నటించిన వీర సింహారెడ్డి ఈ 12న వస్తోంది. తర్వాత ఆయన అనిల్ రావిపూడితో సినిమాకు కమిట్ అయి ఉన్నాడు. వచ్చే నెలలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందంటున్నారు. ఆ తర్వాత వశిష్టతోనే బాలయ్య 108వ సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.

మామూలుగా సోషియో ఫాంటసీ తరహా కథలంటే బాలయ్యకు బాగా ఇష్టం. మరి ఆయనకూ ఆ తరహా కథే చెప్పాడా లేక ఇంకేదైనా కొత్త స్టోరీ చెప్పాడా అనేది తెలియదు కానీ.. ఈ కాంబినేషన్ లో సినిమా ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అంటున్నారు. సో బింబిసార దర్శకుడు మళ్లీ నందమూరి హీరోకే యాక్షన్ కట్ చెప్పబోతున్నాడన్నమాట.