బాలయ్య హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు.. ఇదుగో ప్రూఫ్

నందమూరి బాలకృష్ణ దూకుడుకు ఎంటైర్ ఇండస్ట్రీ సర్ ప్రైజ్ అవుతోంది. వరుసగా సినిమాలు చేస్తూనే మరో వైపు ఆహా లో ఆన్ స్టాపబుల్ షోను మోస్ట్ సక్సెస్ ఫుల్ గా మార్చాడు. తనదైన శైలిలో గెస్ట్ లతో మాట్లాడుతూ ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే ఇన్ఫర్మేషన్ లాగుతున్నాడు. ఆహాలో సూపర్ హిట్ అనిపించుకున్న ఫస్ట్ షో ఇదే కావడం విశేషం. ఇక అఖండ వంటి రోరింగ్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేనితో వీరసింహారెడ్డి మూవీ చేశాడు. ఈ సంక్రాంతికి జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇక ఈ మూవీ పూర్తి కాగానే వెంటనే అనిల్ రావిపూడి సినిమా మొదలుపెట్టాడు.

మామూలుగా ఇప్పుడు చాలామంది టాప్ స్టార్స్.. ఒక సినిమా పూర్తి కాగానే ఏ ఫారిన్ టూర్ కో లేక రెస్టింగ్ మోడ్ లోకో వెళ్లిపోతున్నారు. బట్ బాలయ్య అలా కాదు. ఇక పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన 108వ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పుకోవచ్చు. అఖండ తర్వాత వస్తోన్న వీర సింహారెడ్డితో పాటు ఈ అనిల్ సినిమాతోనూ బాలయ్య హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు.


మామూలుగాఈ ఇరవైయేళ్ల కాలంలో బాలయ్య చేసిన సినిమాలు చూస్తే హిట్ అయిన సినిమాలన్నిటిలోనూ ఆయన విగ్ బావుంటుంది. బాలేని సినిమాలన్నిటిలో విగ్ మైనస్ గా కనిపిస్తుంది. అంటే బాలయ్యకు విగ్ సెట్ అయితే సినిమా హిట్ అనేది డిక్లేర్ అయింది. అఖండతో పాటు వీరసింహంలోనూ విగ్ బావుంది. సో ఇదీ సంక్రాంతి విజేతగా నిలుస్తుందని చెప్పొచ్చు.

ఇక అనిల్ సినిమా ఓపెనింగ్ రోజు చూస్తే అదీ అదిరిపోయింది. సో.. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందనుకోవచ్చు. అంటే హ్యాట్రిక్ గ్యారెంటీఅన్నమాట. ఈ హ్యాట్రిక్ తో పాటు మరో హ్యాట్రిక్ ఏంటంటే.. తమన్ కూడా ఈ మూడు సినిమాలతో బాలయ్యతో ట్రావెల్ అవుతున్నాడు. అలా ఈ ఇద్దరి కాంబినేషన్ లో కూడా హ్యాట్రిక్ పడుతుంది. ఏదేమైనా బాలయ్య దూకుడు మాత్రం బలే స్పీడ్ గా ఉంది.

Related Posts