HIT 3: హిట్ సీక్వెల్స్ లోకి బాలయ్య

హిట్.. నాని నిర్మాణంలో మొదలైన సినిమా. టైటిల్ కు తగ్గట్టుగానే ఫస్ట్ హిట్ సూపర్ హిట్ అయింది. విశ్వక్ సేన్ హీరోగా శైలేష్‌ కొలను రూపొందించిన సినిమా ఇది.

ఆ తర్వాత అదే దర్శకుడు అడవి శేష్‌ తో హిట్ 2 తీశాడు. ఇదీ సూపర్ హిట్ అయింది. అయితే మొదటే వీళ్లు హిట్ వర్స్ అనే మూవీస్ ను క్రియేట్ చేయడానికి రెడీ అయ్యారట.

అందుకే ఒక్కో పార్ట్ లో ఒక్కో హీరో ఉంటాడు. చివర్లో అందరు హీరోలూ ఒకే పార్ట్ లో కనిపిస్తారు. హిట్ 2 తర్వాత చేసే హిట్3లో నాని నటిస్తాడు అనే ప్రచారం జరిగింది.ఆ మేరకు సెకండ్ పార్ట్ లో ఓ చిన్న లీడ్ కూడా ఇచ్చారు. బట్ లేటెస్ట్ గా మరో కొత్త రూమర్ వినిపిస్తోంది. ఈ హిట్ వర్స్ లోకి నందమూరి బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.


ప్రస్తుతం బాలకృష్ణ ”భగవంత్ కేసరి” డోన్ కేర్ అనే మూవీ చేస్తున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రానికి ఆ టైటిల్ ను బాలయ్య బర్త్ డే రోజున రివీల్ చేయబోతున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. శ్రీ లీల ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ తర్వాత బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో లేదా మరోసారి గోపీచంద్ మలినేనితో సినిమా ఉండే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరిగింది. అయినా లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి హిట్ వచ్చింది. ఒకవేళ బాలయ్య కానీ ఖాకీడ్రెస్ వేస్తే ఖచ్చితంగా హిట్ వర్స్ రేంజ్ మారుతుంది. ఏజ్, ఇమేజ్ కు తగ్గట్టుగా మోస్ట్ ఎక్స్ పీరియన్స్ డ్ పోలీస్ గా ఆయన కనిపిస్తే బాక్సాఫీస్ కూడా షేక్ అవుతుంది.


మరోవైపు హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను ప్రస్తుతం వెంకటేష్‌ తో సైంధవ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 21న విడుదల కాబోతోంది. ఆ తర్వాతే అతను హిట్ వర్స్ లోకి వచ్చి థర్డ్ పార్ట్ కు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాడు. ఇటు బాలయ్య నటిస్తోన్న సినిమా దసరాకే అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. మరి ఈ లోగా ఈ కాంబినేషన్ అనౌన్స్ అవుతుందా లేక కొత్త కాంబో అనౌన్స్ అవుతుందా అనేది చూడాలి. బట్ఈ హిట్ వర్స్ లోకి బాలయ్య వస్తే ఫ్యాన్స్ కే కాదు.. థియేటర్స్ మొత్తం పూనకాలే.

Related Posts