Sathyadev : బాలయ్య బాబు ఫ్యాన్స్ ఇక్కడ.. బ్రహ్మముహూర్తలో లేస్తాం..

బాలయ్య బాబు ఫ్యాన్స్ ఇక్కడ.. బ్రహ్మముహూర్తలో లేస్తాం.. అంటున్నాడు సత్యదేవ్. అతని కొత్త సినిమా ఫుల్ బాటిల్ లోనిది ఈ డైలాగ్. ఈ మూవీలో లిక్కర్ సూరి అనే పాత్రలో ఆటో డ్రైవర్ గా కనిపించబోతన్నాడు సత్యదేవ్.

విపరీతమైన తాగుబోతు అయిన సూరి అనే వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో రూపొందినట్టుగా టీజర్ చూస్తే అర్థం అవుతోంది. మ్యాన్షన్ హౌస్ కు మరో బ్రాండ్ అంబాసిడర్ లా అదే పనిగా అదే తాగుతూ హంగామా చేస్తోన్న సూరి అనే వ్యక్తి లైఫ్ లోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ అనే ప్రాబ్లమ్స్ ఎంటర్ అవుతాయి. టైమ్ తనపై కక్ష కట్టిందని ఆ యువకుడు ఫీలవుతోన్న టైమ్ లో ఇంకా పోలీస్ లు, రౌడీలు చేజ్ లూ, జైలూ అన్నీ వచ్చేస్తాయి. మరి ఇవన్నీ అతని లైఫ్ లోకి ఎందుకు వచ్చాయి.. వీటి వెనక ఎవరున్నారు అనేదితెలియాలంటే వాళ్ల స్టైల్ లోనే చెబితే సినిమా చూడాల్సిందే.

అయితే ఓ టైమ్ లో హీరోయిన్ అంటుంది.. ‘ఎలివేషన్స్ ఆపి క్యారెక్టరైజేషన్ గురించి చెప్పమని.. దానికి అతడు రేపు ఉదయం 4గంటల 5 నిమిషాలక.. మీకు ఉప్పాడ బీచ్ తెలుసు కదా.. ఆడకొచ్చేయండి అంటాడు. నాలుగు గంటలకా.. ఆ టైమ్ కు నువ్వు లేస్తావా అంటుంది హీరోయిన్. దీంతో “బాలయ్య బాబు ఫ్యాన్ ఇక్కడ.. బ్రహ్మ ముహూర్తంలో లెగుస్తాం”అంటూ సత్యదేవ్ బాలయ్యను ఇమిటేట్ చేస్తూ చెప్పిన డైలాగ్ బావుంది.

కరెక్ట్ గా చూస్తే ఈ మూవీ ఈ టైమ్ దగ్గరే సరైన మలుపు తీసుకుంటుంది అని ఊహించొచ్చు.
ఆటో డ్రైవర్ పాత్రలో సత్యదేవ్ బాగా సరిపోయాడు. సత్యదేవ్ సరసన సంజన ఆనంద్ ఫీమేల్ లీడ్ చేసింది. కీలక పాత్రల్లో బ్రహ్మాజీ, సునిల్, సాయి కుమార్ నటించారు. శరణ్‌ కొప్పిశెట్టి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రామాంజనేయులు జవ్వాజి, ఎస్డీ కంపెంనీ నిర్మించారు.

Related Posts