ఐదు కోట్ల హీరోకు వంద కోట్లు ఇస్తున్నారా..?

ఏ సినిమా ఇండస్ట్రలో అయినా హిట్ ఇచ్చే కిక్ మామూలుగా ఉండదు. ఆ కిక్ ను కంటిన్యూ చేయడం అందరికీ సాధ్యం కాదు. కానీ విజయం మరో విజయానికి నాందిగా మారుతుంది అనే మాటకు అర్థం చెప్పేలా కన్నడ పరిశ్రమ నుంచి కాంతార సినిమాకు ప్రీక్వెల్ రాబోతోంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా.. ఆ ఆర్టిస్టులెవరో కూడా సరిగా తెలియకుండా.. కన్నడ కాకుండా ఇతర భాషల్లోనూ విడుదలైన కాంతారకు అన్ని భాషల నుంచీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో హీరోగా నటించిన రిషభ్ శెట్టినే దర్శకుడు కూడా. కెజీఎఫ్ లాంటి బిగ్గెస్ట్ హిట్స్ అందించిన హొంబలే పిక్చర్స్ వాళ్లు ఈ చిన్న చిత్రాన్ని కేవలం 18 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. ఏకంగా 400 కోట్ల వరకూ కలెక్ట్ చేసి, కంటెంట్ బలంగా ఉన్నప్పుడు కలెక్షన్స్ కూడా వస్తాయి అనేందుకు మరో ఎగ్జాంపుల్ గా నిలిచింది. మరి ఇంత పెద్ద విజయాన్ని తమ బ్యానర్ కు అందించిన హీరో కోసం ప్రొడక్షన్ హౌస్ ఏకంగా వంద కోట్ల వరకూ ముట్టజెప్పేందుకు సిద్ధమైంది.


నిజానికి కాంతార చిత్రానికి ముందే కాదు.. ఈ సినిమాకు కూడా హీరో కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టికి శాండల్ వుడ్ లో ఇచ్చిన రెమ్యూనరేషన్ కేవలం 5 కోట్లు. అంటే మన దగ్గర టైర్ 3 హీరోల రెమ్యూనరేషన్ అంత. అలాంటి హీరో కాంతారతో 400 కోట్లు తెచ్చాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్ మొదలుపెట్టింది హొంబలే బ్యానర్. ఈ సారి కూడా దర్శకుడు, హీరో రిషభ్ శెట్టే. అయితే ఫస్ట్ పార్ట్ కు అతనికి 5 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చిన నిర్మాణ సంస్థ ఈ సారి యాభై కోట్ల చెక్ ఇచ్చేసిందట.

దీంతో పాటు అదనంగా లాభాల్లో వాటాలు కూడా ఇస్తాం అని ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలున్నాయి. బడ్జెట్ పరంగా రిషభ్ చాలా కంట్రోల్ గా ఉంటాడు. సో..ప్యాన్ ఇండియన్ స్థాయిలో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నా.. మేకర్స్ హ్యాపీ అయిపోతారు. ఇక ఈ ప్రీక్వెల్ కంటెంట్ కూడా మెప్పిస్తే.. కాసుల రాశులు కురుస్తాయి. ఏదేమైనా ఐదు కోట్ల హీరో.. కేవలం ఒకే ఒక్క సినిమాతో వంద కోట్లకు ఎదగడం కన్నడలోనే కాదు.. ప్రపంచ సినిమా చరిత్రలోనే ఎప్పుడూ లేదు అని చెప్పొచ్చు.

Related Posts