అవతార్.. ప్రపంచాన్ని కుదిపేసిన సినిమా. ది గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కేమెరూన్ అద్భుత సృష్టికి యావత్ ప్రపంచం దాసోహమైపోయింది. ఆ రేంజ్ లో అద్బుతమైన కథతో కూడిన విజువల్ వండర్ ను అంతకు ముందు ఎవరూ చూడలేదు. అందుకే ఈ మూవీ ఇప్పటి వరకూ హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డులను నిలబెట్టుకుంది.

అంతటి రెస్పాన్స్ అందుకున్న చిత్రానికి సీక్వెల్స్ తీస్తానని ప్రకటించి మొదలుపెట్టాడు జేమ్స్ కేమెరూన్. ఒకటీ రెండు కాదు.. నాలుగు భాగాలు వస్తాయని కూడా చెప్పాడు. అన్నట్టుగానే రెండో భాగం అవతార్ ద వే ఆఫ్‌ వాటర్ ఈ శుక్రవారం వస్తోంది. అయితే ఈ చిత్రానికి వస్తోన్న ప్రీమియర్ రివ్యూస్ చూస్తోంటే ఇక ఇక్కడితో అవతార్ కు స్వస్థి చెబుతారేమో అనిపిస్తోంది.


ఫస్ట్ పార్ట్ లో పండోరా గ్రహాన్ని చూపించిన జేమ్స్.. ఈ సారి కథను అండర్ వాటర్ లో చెప్పబోతున్నాడు. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ చూసే చాలామంది ఫిదా అయ్యారు. మరో విజువల్ వండర్ వస్తోందనుకున్నారు. ఈ మూవీకి క్రేజ్ కూడా అలాగే ఉంది. ఎన్నో దేశాల్లో ఫస్ట్ వీకెండ్ కు ఇప్పటికే టికెట్స్ అయిపోయాయి. ఆ క్రేజ్ వల్లే రిలీజ్ తోనే మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేసిందీ చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 52 వేల థియేటర్స్ లో విడుదలవుతుంది. ఇంతకు ముందు ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాగా అవెంజర్స్ ఎండ్ గేమ్ కు ఉంది. అవతార్ 2 ఆ రికార్డ్ ను తిరగరాసింది.


ఇక ఈ మూవీకి సంబంధించి కొన్ని దేశాల్లో ఆల్రెడీ ప్రీ వ్యూస్ వేశారు. ప్రీ వ్యూస్ చూసిన వారంతా అబ్బే అని పెదవి విరుస్తున్నారు. యస్.. సినిమాకు దాదాపు అన్ని చోట్ల నుంచి మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. అవతార్ తో పోల్చితే అస్సలు బాలేదు అనే వారు కూడా ఉన్నారు. దీంతో ఈ పార్ట్ రిజల్ట్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.
అయితే ఈ పార్ట్ కూడా ఫస్ట్ పార్ట్ లా హిట్ కాకుంటే ఇక అవతార్ కు సీక్వెల్స్ తీయను అని గతంలోనే ప్రకటించాడు దర్శకుడు జేమ్స్ కేమెరూన్. సో.. ఒకవేళ ఈ అవతార్ ద వే ఆఫ్‌ వాటర్ పోతే.. ఇక మళ్లీ కొత్త అవతార్ లు ఉండవనే కదా అర్థం. మరి నిజంగానే ప్రీ వ్యూస్ చెప్పిన వారి మాటలు నిజమవుతాయా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.