టాలీవుడ్లో మరో విషాదం… బాధలో ఎన్టీఆర్
Latest Movies Tollywood

టాలీవుడ్లో మరో విషాదం… బాధలో ఎన్టీఆర్

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ పీఆర్వో మరియు నిర్మాత మహేష్ కోనేరు హఠాత్తుగా కన్నుమూశాడు. విశాఖపట్నంలో అతను గుండెపోటుతో చనిపోయాడన్న వార్తతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కి గురైంది. ‘బాహుబలి’ సహా ఎన్నో భారీ చిత్రాలకు పీఆర్వోగా పని చేసిన అనుభవం మహేష్ సొంతం. నందమూరి హీరోలు జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ కు అతను అత్యంత సన్నిహితుడు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ అతణ్ని కుటుంబ సభ్యుడిలాగే చూస్తాడు. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ అండతోనే అతను నిర్మాత కూడా అయ్యాడు.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పేరుతో సొంత బేనర్ పెట్టి నందమూరి కళ్యాణ్ రామ్ హీరోతో చేసిన ‘నా నువ్వే’ చిత్రంతోనే మహేష్ నిర్మాత అవతారం ఎత్తాడు. ఆ సినిమా సరిగా ఆడకపోయినా.. నిరాశ చెందకుండా తర్వాత మరికొన్ని చిత్రాలు నిర్మించాడు. కళ్యాణ్ రామ్‌తోనే తీసిన రెండో సినిమా ‘118’ మంచి విజయాన్నే అందుకుంది. ఆ తర్వాత మహేష్ నుంచి మిస్ ఇండియా తిమ్మరసు చిత్రాలు వచ్చాయి. నిర్మాతగా మరో స్థాయికి చేరుకునేందుకు ప్రణాళికలు రచించుకుంటున్న సమయంలో మహేష్ ఇలా తనువు చాలించడం ఇండస్ట్రీ వర్గాలకు పెద్ద షాక్. మీడియా నుంచి ఎదిగి మీడియా వర్గాలన్నింటికీ అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి.. అలాగే పరిశ్రమలోనూ మంచి పేరున్న మహేష్ ఇలా హఠాత్తుగా కన్నుమూయడం అందరికీ పెద్ద షాకే.

ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని మీడియా వాళ్లతో పాటు ఇండస్ట్రీ జనాలు ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు. తారక్, కళ్యాణ్ రామ్‌లకు బ్యాక్ బోన్ లాగా ఉండే మహేష్ కన్నుమూయడం వారికి పెద్ద లోటే. నందమూరి అభిమానులకు మహేష్‌తో ఉన్న అనుబంధమే వేరు. అభిమాన సంఘాలతో నిత్యం కోఆర్డినేట్ చేసుకుంటూ సోషల్ మీడియా మేనేజ్మెంట్ కూడా చూసుకుంటూ ఉంటాడు మహేష్. గత ఏడాది బీఏ రాజు లాంటి సీనియర్ పీఆర్వో కమ్ ప్రొడ్యూసర్‌ను కోల్పోయిన ఇండస్ట్రీకి ఇప్పుడు మహేష్ కోనేరు కన్నుమూత పూడ్చుకోలేని లోటు అనడంలో సందేహం లేదు.

Post Comment