పవన్ కళ్యాణ్ బాటలో మరో స్టార్ హీరో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ మాట చెప్పుకుంటూ ఫ్యాన్స్ ఎంత గర్వంగా ఫీలవుతారో అందరికీ తెలుసు. పవన్ అనే కాదు.. అంతకు ముందు కూడా అందరు హీరోలకూ ఏదో ఒక బిరుడు ఉండటం సినిమా పుట్టిన దగ్గర్నుంచీ ఉన్నదే. అయితే అప్పట్లో వారి నటనా సామర్థ్యాన్ని బిరుదులుండేవి. ఇప్పుడు ఇమేజ్ లను బట్టి వచ్చాయి. ఆ ట్రెండ్ మెగాస్టార్ నుంచే మొదలైందని చెప్పాలి. మెగాస్టార్ తర్వాత ఆ రేంజ్ లో వైబ్రేట్ అయిన బిరుదు మాత్రం నిస్సందేహంగా పవన్ కళ్యాణ్ పవర్ స్టారే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కింగ్ నాగార్జున, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(ఇప్పుడు ఐకన్ అని తగిలించుకున్నాడు), రౌడీస్టార్, రెబల్ స్టార్, మాస్ మహరాజ్ ఇలా చాలామంది ట్యాగులు తగిలించుకున్నారు. బట్ పవర్ స్టార్ మాత్రం నిజంగా స్పెషల్ అనే చెప్పాలి. మెగాస్టార్ పవర్ స్టార్ ను మిక్స్ చేసుకుని రామ్ చరణ్ కూడా మెగా పవర్ స్టార్ అనిపించుకున్నాడు.
అయితే కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కొత్త నిర్ణయం తీసుకున్నాడు. తన పేరు ముందు ఏ బిరుదూ ఉండకూడదని. అది భీమ్లా నాయక్ నుంచే అప్లై అవుతోంది. ఈ మూవీకి సంబంధించి పోస్టర్స్ లో కానీ టైటిల్స్ లో కానీ కేవలం పవన్ కళ్యాణ్ అని మాత్రమే ఉంటుంది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూట్ లోనే కొత్త నిర్ణయం తీసుకున్నాడు తమిళ్ స్టార్ అజిత్. తెలుగు వాడే అయిన అజిత్ తమిళ్ లో సూపర్ స్టార్ అయ్యాడు. అక్కడ ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే కొన్నాళ్ల క్రితమే తనకు అభిమాన సంఘాలు వద్దని సంచలన నిర్ణయం తీసుకున్నాడు అజిత్. తనకు అభిమానులే వద్దు అని ఖచ్చితంగా చెప్పాడు. తన పేరు మీద ఎవరూ ఏమీ చేయొద్దని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇక లేటెస్ట్ గా తను కూడా తన పేరు ముందు ‘తలా’అనే బిరుదును తీసేసుకున్నాడు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం విశేషం.
‘‘మీడియా వారికి, సాధారణ జనంతో పాటు నా జెన్యూన్ అభిమానులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపై నన్ను కేవలం అజిత్ లేదా అజిత్ కుమార్ లేదా ఏకే అని మాత్రమే పిలవాలి. నా పేరు ముందు తలా( నాయకుడు) లేదా అలాంటి అర్థాలు వచ్చే ఏ బిరుదులూ వాడొద్దు. మీరంతా ఆయురారోగ్య, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ప్రేమతో మీ అజిత్’’..
ఇదీ అజిత్ మీడియాకు పంపించిన ప్రెస్ నోట్. సో.. సొంత పేరు ముద్దు.. మరో పేరు వద్దు అనే ట్రెండ్ ఇక మొదలవుతుందేమో చూడాలి.

Related Posts