Latest Movies

కృష్ణవంశీకి మరో షాక్

ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ అనిపించుకున్న కృష్ణవంశీ ఇప్పుడు ఒక్క హిట్ కోసం చకోర పక్షిలా చూస్తున్నాడు. అతనికి సాలిడ్ హిట్ రాక దశాబ్దం అవుతోంది. ఈ క్రమంలో మరాఠీలో హిట్ అయిన నట సామ్రాట్ అనే సినిమాను తెలుగులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ ప్రధాన పాత్రల్లో రంగ మార్తాండగా రీమేక్ చేయడం ప్రారంభించాడు. రెండేళ్ల క్రితమేు ప్రారంభం అయిన ఈ ప్రాజెక్ట్ ఇంత వరకూ ముందుకు కదలలేదు. కొంత భాగం చిత్రీకరించినా.. కొన్నాళ్లుగా సెట్స్ పైకి వెళ్లడం లేదు. దీంతో సినిమా ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది.
అది నిజమే అన్నట్టుగా కృష్ణవంశీ ప్రస్తుతం మరో సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడట. దీంతో ఇకం రంగమార్తాండ చిత్రానికి తెరపడిపోయినట్టే అంటున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ను తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకున్న కృష్ణవంశీ ఏం చెబుతాడో.

Post Comment