టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వ‌బోతున్న మ‌రో న‌ట వార‌సురాలు
Latest Movies Tollywood

టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వ‌బోతున్న మ‌రో న‌ట వార‌సురాలు

టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది న‌ట వారసులు ఉన్నారు. అయితే.. న‌ట వార‌సుల‌తో పోలిస్తే.. న‌ట వార‌సురాళ్లు జాబితా త‌క్కువే. ఇప్పటి వరకు కృష్ణ కుమార్తె మంజుల, మోహన్‌బాబు తనయురాలు మంచు లక్ష్మీ, నాగబాబు తనయురాలు నిహారిక, రాజశేఖర్ తనయురాలు శివానీ, శివాత్మిక‌ మాత్రమే ఉన్నారు. మంచు ల‌క్ష్మీ సినిమాల్లో న‌టిస్తూనే మ‌రో వైపు టాక్ షోలు చేస్తుంది. అలాగే నిహారిక సినిమాల్లో న‌టించింది. పెళ్లి త‌ర్వాత వెబ్ సిరీస్, సినిమాలు నిర్మించే ప్లాన్ లో ఉంది.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఇప్పుడు టాలీవుడ్ లోకి మ‌రో న‌ట వార‌సురాలు ఎంట్రీ ఇవ్వ‌బోతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఎవ‌రంటే.. శ్రీకాంత్, ఊహ దంపతుల కుమార్తె మేధ త్వరలోనే సినిమాల్లో నటించనున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మేధ వయసు 17 ఏళ్లు. ఆమె ఎంతో అందంగా ఉంటుంది. చూసేందుకు అచ్చం ఊహలాగానే ఉంటుందని పలువురు సినీ ప్ర‌ముఖులు, శ్రీకాంత్ స‌న్నిహితులు చెబుతున్నారు. అయితే.. ఇప్పటికే శ్రీకాంత్ తనయురాలు మేధ ఓ చారిత్రాత్మక తెలుగు మూవీలోనూ నటించింది. ఆ సినిమానే రుద్రమదేవి.

అనుష్క హీరోయిన్‌గా నటించిన రుద్రమదేవి సినిమాలో మేధ చిన్నప్పటి అనుష్క పాత్రలో కాసేపు కనిపించింది. అప్పుడే ఆమె భవిష్యత్ తార అవుతుందని పలువురు సినీ పండితులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె నటన కూడా బాగుందని చాలా మంది ప్రశంసించారు. దీంతో మేధను హీరోయిన్‌గా చేయాలని అప్పుడే శ్రీకాంత్, ఊహ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారట. అప్పటి నుంచి మేధ ప్రత్యేకంగా డ్యాన్సుల్లో శిక్షణ తీసుకుంది. ముఖ్యంగా భరతనాట్యంలో ప్రావీణ్యం పొందింది. ప్రస్తుతం ఆమె ప్లస్ 2 చదువుతోంది. నటన అంటే ఆసక్తి ఉన్నా మేధ చదువులో కూడా టాపర్ అని తెలుస్తోంది. చ‌దువు పూర్తైన త‌ర్వాత సినిమాల్లో న‌టిస్తుంద‌ట‌. అయితే.. మేథ కోసం స్వ‌యంగా శ్రీకాంత్ ఓ స్టోరీ రెడీ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌లు వాస్త‌వ‌మేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.

Post Comment