మాస్ మహరాజ్ గా ఒకప్పుడు వెలుగు వెలిగాడు రవితేజ. అతని సినిమా అంటే బయ్యర్స్ కు మినిమం గ్యారెంటీ. కానీ ఇప్పుడు సీన్ మారింది. రొటీన రొడ్డకొట్టుడు సినిమలు, నటనతో ఓ రేంజ్ లో మొహం మొత్తేలా చేశాడు. పైగా కథల ఎంపికలో సైతం రాంగ్ స్టెప్స్ వేస్తున్నాడు. దీంతో ఎప్పుడో కానీ హిట్ రావడం లేదు. బట్ ఫ్లాపులు కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి. క్రాక్ తర్వాత వచ్చిన ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ ఒకదాన్ని మించి ఒకటి పోయాయి. విశేషం ఏంటంటే.. ఫ్లాపులు వస్తున్నా.. రవితేజ గ్రాఫ్ తగ్గలేదు. చేతినిండా సినిమాలున్నాయి.
ప్రస్తుతం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేస్తున్నాడు. శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 23న విడుదల చేయాలనుకున్నారు. ఆ మధ్య వచ్చిన ఓ మాస్ పాట బావుంది. కానీ టీజర్ చూసిన తర్వాత మరో రొటీన్ సినిమాలానే అనిపించింది. ఆ విషయం మూవీ టీమ్ కు కూడా బాగా అర్థమైనట్టుంది. ఫైనల్ వెర్షన్ చూసుకున్నాక ఖచ్చితంగా ఫ్లాప్ అనే నమ్మకం పెరిగిందట. ఆ నమ్మకాన్ని మార్చేందుకు మరోసారి షూటింగ్ కు వెళుతున్నారు. అంటే రీ షూట్ అన్నమాట.
ఏదైనా సినిమాలో కొన్ని సీన్స్ వీక్ గా అనిపిస్తే రీ షూట్ కు వెళ్లడం ఇప్పుడు చాలా కామన్ అయింది. బట్ ఈ మూవీ విషయంలో సీన్స్ కాదు.. చాలా సీక్వెన్స్ లనే రీ షూట్ చేయాల్సి వస్తోందంటున్నారు. అంటే మళ్లీ మేజర్ ఆర్టిస్టులు, కాల్షీట్స్, డేట్స్ అంటూ రకరకాల సమస్యలు ఉంటాయి. ఉన్న తర్వాతైనా అదే రైటర్ నుంచి కొత్త స్టఫ్ ను ఎలా ఆశిస్తారు..? అందుకే ఈ రీ షూట్స్ కు సంబంధించి కావాల్సిన మార్పులు చేయడానికి కొత్త రైటర్స్ ను హైర్ చేసుకుంటున్నారని టాక్.
నిజానికి రవితేజ ఇవన్నీ పట్టించుకోడు. సినిమా చేశామా అయిపోయిందా.. డబ్బులు వచ్చాయా.. అన్నంత వరకే ఉంటాడు. బట్ ఈ మూవీపై కాస్త నమ్మకంగా ఉన్నాడనీ.. ఆ నమ్మకాన్ని కూడా పోగొట్టేలా దర్శక, రచయితల పని తీరు ఉండటంతోనే రీ షూట్ కు ఓకే చెప్పాడంటున్నారు. ఏదేమైనా ఈ రీ షూట్ వల్ల సినిమా డిసెంబర్ 23న కూడా రావడం కష్టమే అంటున్నారు. సో.. ఇవన్నీ రూమర్స్ మాత్రమేనా లేక నిజంగానే సమస్య ఉందా అనేది తర్వాత.. బట్.. నిజమే అయితే మాత్రం మాస్ రాజా మరో ఫ్లాప్ కు రెడీ అవుతున్నట్టుగానే చెప్పాలి.