అమృత గాయని వాణీ జయరామ్

వాణి జయరామ్.. ఈ పేరు వినగానే మనసు మైమరచిపోయే గీతాలెన్నో మదిలో మెదులుతాయి. క్లాస్ నుంచి క్లాసికల్ సాంగ్స్ వరకూ, జానపదం నుంచి జాజ్ బీట్స్ వరకూ ఆ గాత్రంలో వింటే అమృతగీతాలవుతాయి. ఏ పాటైనా అలవోకగా.. తను తప్ప వేరెవరూ అలా పాడలేరేమో అనేంత హాయిగా పాడేయడమే ఆమె స్పెషాలిటీ. గాత్రం వింటే మనిషిని చూడాలనిపించేంతటి ఆ గానసరస్వతి వాణి జయరామ్. ఇండియన్ సినిమాపై తనదైన గాన మాధుర్యంతో అలరించిన ఆ అమృతగాత్రం మూగబోయింది.ఈ మధ్యే పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన ఈ మధురగాయని 70యేళ్ల వయసులో చెన్నైలో కన్నుమూశారు.


ఎన్నో కష్టమైన రాగాలన్నీ కూడా ఐదేళ్ళ వయసులోనే నేర్చుకుని బాలమేధావి అనిపించుకున్నారు వాణి జయరాం. ఆ ప్రతిభతోనే కర్నాటక సంగీతంలో పట్టు సాధించారు. చిన్నతనం నుండి హిందీ సినిమా పాటలు విని, వాటిమీద మక్కువ పెంచుకున్నారు. తను కూడా సినిమాల్లో పాటలు పాడాలని కలగన్నారు.. తర్వాత కాలంలో ఆ కలను నెరవేర్చుకున్నారు. సినిమా పాటకే మకుటమయ్యారు.


సినిమా సంగీతం మాత్రమే సంగీతం కాదు అనే అభిప్రాయం ఆమెది. లలిత సంగీతం, శాస్త్రీయ, ఉప శాస్త్రీయ, జానపదం… ఇవన్నీ సంగీతంలో భాగమే అనుకున్న వాణి, ఎన్నో రకాల సంగీతాల్లో స్పెషలైజ్‌ చేశారు. సినీ పరిశ్రమలోకి రాకముందే భజన్స్‌, గజల్స్‌ ప్రొగ్రాములు చేశారు.


వాణి తమిళనాడులో వేలూరులోని సంగీత కుటుంబంలో పుట్టారు. వాణి తల్లి కర్నూల్‌లో పుట్టి పెరగడం వల్ల ఆమెకు తెలుగు బాగా వచ్చు. జన్మతహ తమిళియన్ అయిన వాణీ అసలు పేరు కలై వాణి. జయరాం