ప్రమోషన్స్ అంటే పానం బాగలేదు అన్నవ్.. మరి గిదేంది సమంతా.. ?

సమంత ఆన్ స్క్రీన్ పై మంచి నటి. అందులో డౌట్ లేదు. అలాగని అన్ని పాత్రలూ చేయలేదు అని రీసెంట్ గా వచ్చిన శాకుంతలం ప్రూవ్ చేసింది. రెండేళ్లుగా అమ్మడు పెళ్లి, విడాకులు వ్యవహారాల్లో నలుగుతూ నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తూ వస్తోంది. ఓ దశ దాటాక తన ఆరోగ్యం పాడైంది. మనిషి అన్నాక మాయదారి రోగాలు రాకుండా ఉంటాయా.. ? అందుకే అందరూ పాపం సమంతకు సానుభూతి చూపించారు. నిజంగా తనకు హెల్త్ పాడైంది. బట్ ఆ విషయాన్ని అడ్డుపెట్టుకుని యశోద సినిమా టైమ్ నుంచి ఆఫ్ స్క్రీన్ లోనూ అద్భుతమైన నటన చూపిస్తూ వస్తోంది సమంత. కొంత హార్ష్ గా ఉన్నా.. ఇది నిజం అంటున్నారు నెటిజన్స్. వాళ్లు అలా అనేందుకు లేటెస్ట్ గా వచ్చిన రెండు మూడు స్టిల్స్ ఓ ఉదాహరణగా చెబుతున్నారు. మరి ఈ స్టిల్స్ ఏంటీ అంటే అమ్మడు ప్రస్తుతం సిటాడెల్ అనే ఓ వెబ్ సిరీస్ చేస్తోంది కదా..? ఆ సిరీస్ కు సంబంధించిన స్టిల్స్ అన్నమాట. మరి ఈ స్టిల్స్ ఏముందీ..? అంటే..


ఓ ఐదారేళ్ల క్రితం సమంత ఎంత ఛార్మ్ గా ఉంది..? ఎంత ఎనర్జిటిక్ గా ఉంది..? తన ఫేస్ లో ఎంత గ్లో కనిపించేది అనేది అందరికీ గుర్తుంది కదా.. యస్.. ఈ స్టిల్ లో అదే కనిపిస్తోంది. కానీ ఓ వారం రోజుల క్రితమే తన ఆరోగ్యం బాగాలేదని.. శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయలేనని చెప్పి ఎగ్గొట్టింది. పోనీ అంతకు ముందు చేసిన ప్రమోషన్స్ లో అయినా ఉత్సాహంగా కనిపించిందా అంటే లేదు. ఎప్పుడూ కళ్ల జోడు పెట్టుకుని.. తన బాధను కవర్ చేసుకుంటున్నాం అంటూ సింపతీ కొట్టే ప్రయత్నాలూ చేసింది. మరి వారం కూడా తిరక్కుండానే అన్ని సమస్యలూ పోయాయా..? సడెన్ గా ఇంత ఎనర్జిటిక్ గా, ఎంత గ్లోతో ఎలా మారింది అంటూ ఆమె యాంటీ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. నిజంగానే సమంత సడెన్ గా మారిపోయిందేంటా సాధారణ జనానికి కూడా డౌట్ వచ్చేలా ఉన్నాయి ఈ ఫోటోస్. ఏమో.. ఈ గ్లామర్ ప్రపంచంలో ఏది నిజమో.. ఏది అబద్ధమో.. ఏది నటనో అర్థవై సావదు కొన్నిసార్లు.

Related Posts