అల్లు అర్జున్ ను ఆకాశానికెత్తిన ”డ్రీమ్ గాళ్”

పుష్ప ది రైజ్ మూవీతో అల్లు అర్జున్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. అతని నటన, స్టైల్, మేకోవర్, యాక్సెంట్.. ఇలా అన్ని విషయాల్లోనూ ది బెస్ట్ అనిపించుకున్నాడు. ఈ మూవీతో ప్యాన్ ఇండియన్ స్టార్ గా తిరుగులేని మార్కెట్ కూడా క్రియేట్ అయింది.

సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో బన్నీకి దేశవ్యాప్తంగా అద్భుతమైన అప్లాజ్ కూడా వచ్చింది. ఈ మూవీతోనే అతను స్టైలిష్‌ స్టార్ నుంచి ఐకన్ స్టార్ గా మారాడు. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతోంది. ఆల్రెడీ దీనికి సంబంధించి రిలీజ్ చేసిన వీడియోకు గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సారి పుష్ప ది రూల్ పేరుతో రాబోతోన్న ఈ మూవీతో నిజంగానే అతను అన్ని భాషల్లోని బాక్సాఫీస్ ను రూల్ చేస్తాడు అనే విశ్లేషణలు ఉన్నాయి.

అయితే సినిమా వచ్చిన ఇన్నాళ్ల తర్వాత ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ, ఇండియాస్ ఫస్ట్ డ్రీమ్ గాళ్ హేమమాలిని అల్లు అర్జున్ ను పొగడ్తల్లో ముంచెత్తారు.
‘అతను(అల్లు అర్జున్) చాలా బావుంటాడు. నిజంగా ఇలాంటి పాత్రలు ఒప్పుకోవాలంటే దమ్ముండాలి. మా బాలీవుడ్ లో ఒక్కరు కూడా ఇలాంటివి చేయలేరు” అంటూ ఇన్ డైరెక్ట్ గా బాలీవుడ్ హీరోలకూ చురకలు అంటిచారు హేమమాలిని.

ఒక రకంగా ఆమె చెప్పిన మాటలు నిజమే. ఇప్పుడు ఇండియన్ సినిమాకు ముఖచిత్రంగా మారింది తెలుగు పరిశ్రమే. అందుకే ఒక్కొక్కరుగా టాలీవుడ్ తో పాటు మన హీరోలను కూడా ఫాలో అవుతున్నారు. కుదిరితే ఇలా అప్రిసియేట్ చేస్తున్నారు.

Related Posts