సుకుమార్ కు అల్లు అర్జున్ వార్నింగ్

2021డిసెంబర్ 17న విడుదలైన పుష్ప బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. కంటెంట్ పరంగానే కాక, మేకింగ్ తో పాటు మేకోవర్, అల్లు అర్జున్ డీ గ్లామర్ రోల్, స్లాంగ్, మ్యూజిక్, హీరోయిన్.. ఇలా అన్ని విషయాల్లోనూ ది బెస్ట్ అనిపించుకుని ప్యాన్ ఇండియన్ లెవల్లో ఆడియన్స్ ను ఆకట్టుకుని విడుదలైన అన్ని చోట్లా తగ్గేదే లే అంటూ కమర్షియల్ గా సక్సెస్ చూసింది.

ఈ మూవీలోని మేనరిజమ్స్ ను ఇంటర్నేషనల్ ఆర్టిస్టుల నుంచి ఆటగాళ్ల వరకూ ఇమిటేట్ చేశారంటే బన్నీ వేసిన ఇంపాక్ట్ ఎంత పెద్దగా ఉందో ఊహించుకోవచ్చు. ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్ తీస్తున్నారు. అప్పుడు పుష్ప ది రైజ్ అన్నారు. అన్నట్టుగానే సాధారణ కూలీ నుంచి గంధపు చెక్కల స్మగ్లర్ గా ఎదిగాడు పుష్ప. ఇప్పుడు పుష్ప ది రూల్ అంటున్నారు. ఈ సారి ఇంటర్నేషనల్ లెవెల్లో అతను ఎలా ఎదిగాడు అనేది చూపిస్తారు. రీసెంట్ గానే ఈ మూవీ వైజాగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అయితే ఈ మూవీకి సంబంధించి అల్లు అర్జున్ సుకుమార్ కు ఓ వార్నింగ్ ఇచ్చాడట.

ఎట్టిపరిస్థితిల్లోనూ ఈ మూవీని ఫస్ట్ మూవీ వచ్చిన డేట్ కే విడుదల చేయాలని. అంటే ఈ యేడాది డిసెంబర్ 17నే పుష్ప2ను కూడా విడుదల చేయాలన్నమాట. మామూలు సినిమాలు అయితే ఓకే. కానీ ఈ చిత్రానికి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ చాలా అవసరం. ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తోంది. అంటే అడవులన్నీ ఎండిపోయి కనిపిస్తాయి. నెక్ట్స్ వర్షాకాలం. ఆ టైమ్ లో అడవుల్లో షూటింగ్ అంటే అంత సులువు కాదు. అయినా అల్లు అర్జున్ మాత్రం సుకుమార్ కు స్ట్రాంగ్ గానే విషయం చెప్పాడట.

దీంతో సుకుమార్ కూడా ఉరుకులు పరుగులుగా ఈ మూవీ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు. మరోవైపు ఫస్ట్ పార్ట్ లో చాలా కీలకంగా కనిపించిన హీరోయిన్ పాత్రకు చాలా పెద్ద కోత పెడుతున్నారట. అంటే ఈ సీక్వెల్ లో రష్మిక మందన్నా పాత్ర కేవలం ఒకటీ రెండు పాటలకు మాత్రమే పరిమితం అవుతుంది. పుష్ప రైజింగ్ లో ఆమె పాత్ర ఏమీ ఉండదట. ఆ మేరకు తన క్యారెక్టర్ కు సగానికి పైగా కుదించారని టాక్.

అదే టైమ్ లో సమంత ప్లేస్ లో మరో బ్యూటీతో ఐటమ్ సాంగ్ చేయించాలనుకుంటున్నారు. ఏదేమైనా త్వరగా పూర్తి చేయాలి కాబట్టి రష్మిక పాత్ర కుదించారా లేక వరుసగా ఆమె నుంచి వస్తోన్న వివాదాల వల్ల తొలగించాలనుకున్నారా అనేది తెలియదు కానీ.. ఈ లేటెస్ట్ అప్డేట్‌ తో రెండు విషయాలు క్లియర్ అయ్యాయి. పుష్ప2 ఈ డిసెంబర్ 17న ఖచ్చితంగా విడుదలవుతుంది. అలాగే రష్మిక మందన్నా పాత్రను చాలా వరకూ తొలగించారు. మరి దీనిపై ఈ నేషనల్ క్రష్‌ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Related Posts