అల్లు అర్జున్ ఆన్సర్ అదిరిపోయింది

పుష్ప ది రైజ్ తో దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. తన ఇమేజ్ కు భిన్నంగా రా అండ్ రస్టిక్ లుక్ తో పాటు అద్భుతమైన చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడి అదరగొట్టాడు. సుకుమార్ టేకింగ్, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో పాటు హీరోయిన్ రష్మిక మందన్నా, ఐటమ్ సాంగ్ సమంత అందాలు అన్నీ కలిసి పుష్ప ది రైజ్ ను బిగ్గెస్ట్ హిట్ గా నిలిపాయి.

ఈ విజయం ఇచ్చిన కిక్ తో ఈ చిత్రానికి రెండో భాగం చేస్తున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్షన్ లోనే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది పుష్ప ది రూల్. హైదరాబాద్ లో ఫహాద్ ఫాజిల్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటీ అనే ప్రశ్న చాలా రోజుల నుంచీ వినిపిస్తోంది. కొందరు అప్పుడెప్పుడో మొదలై ఆగిపోయిన ఐకన్ చేస్తాడు అన్నారు. ఇంకొందరు త్రివిక్రమ్ తోనే ఉంటుందీ అన్నారు. బట్ ఈ రెండూ కాకుండా సందీప్ రెడ్డితో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు ఈ ఐకన్ స్టార్.


అర్జున్ రెడ్డితో కల్ట్ హిట్ కొట్టి.. ఇదే కథను బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా చేసి అక్కడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సందీప్. ప్రస్తుతం అతను రణ్ బీర్ సింగ్ తో యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు సౌత్ డైరెక్టర్స్ కు బాలీవుడ్ లో తిరుగులేని డిమాండ్ ఉంది. దీంతో సందీప్ ను గతంలోనే చాలామంది నిర్మాతలు లాక్ చేశారు. అందులో ఒకటి ప్రభాస్ తో చేయాల్సిన సినిమా ఉంది. దీనికి ‘స్పిరిట్’ అనే టైటిల్ కూడా పెట్టేశారు. మరి ఆ ప్రాజెక్ట్ ఏమైందో కానీ సడెన్ గా ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమాకు కమిట్ అయ్యాడు సందీప్.

నిజానికి ఈ కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ ఉంటుందని ఎవరూ గెస్ కూడా చేయలేదు. అందుకే చాలామంది షాక్ అయ్యారు. ఇక ఈ చిత్రాన్ని కూడా ప్రధానంగా బాలీవుడ్ వారే నిర్మిస్తున్నారు టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాత కాగా.. తెలుగు నుంచి కృష్ణకుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాలుగా ఉన్నారు. టి సిరీస్, అల్లు అర్జున్, గుల్షన్ కుమార్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి అల్లు అర్జున్ చెప్పిన ఆన్సర్ అదిరిపోయింది. కానీ సందీప్ ఆల్రెడీ కమిట్ అయిన ప్రభాస్ స్పిరిట్ సినిమా సంగతేంటీ అనేది మాత్రం తేలలేదు. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందా..? లేక స్పిరిట్ తర్వాతే ఐకన్ స్టార్ తో సినిమా ఉంటుందా అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

Related Posts