టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అలీ సతీసమేతంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సీయం వై.యస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ మధ్యే అలీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. అలీ తన భార్య జుబేదాతో కలిసి బుధవారం ముఖ్యమంత్రిని కలసిన కారణం ఏంటంటే అలీ పెద్దకూతురు ఫాతిమా వివాహం నిశ్చయమైంది.

మొన్నీమధ్యే ఫాతిమా ఎంగేజ్‌మెంట్‌ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా అలీ వివాహ ఆహ్వాన పత్రిక తొలిప్రతిని సీయం జగన్‌మోహన్‌ రెడ్డికి అందించారు. పెళ్లిపత్రిక స్వీకరించిన జగన్, అలీతో తప్పకుండా వివాహానికి వస్తాను అని మాటిచ్చారని తెలుస్తుంది.