ఏజెంట్.. మమ్మూట్టిన అవమానించారా..?

ఇండియాస్ బెస్ట్ యాక్టర్స్ లో మమ్మూట్టి ఒకరు. ది బెస్ట్ యాక్టర్ గా ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు. ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డ్ లూ అందుకున్నాడు. లోకల్ అవార్డ్స్ అయితే లెక్కేలేదు. అయితే అతను ఏ సినిమా చేసినా ఆసినిమాకు తనే డబ్బింగ్ చెప్పుకుంటాడు. ఇది ఇప్పుడు కాదు.. ఎప్పుడో 90ల్లో వచ్చిన కే విశ్వనాథ్ స్వాతికిరణం నుంచీ ఉంది. ఏ నటుడైనా తన పాత్రకు డబ్బింగ్ చెప్పకపోతే ఆ నటన కంప్లీట్ కాదు అనేది చాలామంది మళయాలీలు నమ్ముతారు. అందుకే మమ్మూట్టి కష్టమైనా అప్పట్లోనే అద్భుతంగా డబ్బింగ్ చెప్పాడు. తర్వాత రీసెంట్ గా వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్రలోనూ తనే డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఇలా చేయడం వల్ల ఆ పాత్రకు నటుడు పూర్తిగా కనెక్ట్ అవుతాడు.
తెలుగులో యాత్ర తర్వాత చేసిన సినిమా ‘ఏజెంట్’.అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. ఈ మూవీలో మమ్మూట్టి ‘రా’ఆఫీసర్ గా నటించాడు. ఈ పాత్రే సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ చూస్తే అర్థం అయింది. అయితే అంత పెద్ద నటుడికి సంబంధించి ఓ బిగ్గెస్ట్ మిస్టేక్ చేసింది మూవీ టీమ్. ట్రైలర్ లో మొదటి భాగంలో తన పాత్రకు మమ్మూట్టి డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఆ తర్వాత వచ్చే డైలాగ్స్ లో వేరే వారితో డబ్బింగ్ చెప్పించినట్టుగా ఉంది. నిజానికి మమ్మూట్టి వాయిస్ యూనిక్ గా ఉంటుంది. వినగానే తెలిసిపోతుంది. అలాంటిది సగం డైలాగ్స్ కు ఆయనతో డబ్బింగ్ చెప్పించి. మిగతా సగం వేరే వారితో చెప్పిండం అంటే ఆయన్ని అవమానించడమే. పోనీ ఆయన వాయిస్ బాగోదా అంటే లేదు. కంచు మోగినట్టుగా ఉంటుంది. లేదూ తెలుగు సరిగా పలకలేడా అంటే ఆ సినిమా హీరో కంటే వందశాతం బెటర్ గా పలకగలడు. మరి ఎందుకు ఇలా చేశారు అనేది వారికే తెలియాలి. కానీ ఓ సీనియర్ యాక్టర్ విషయంలో ఇలాంటి తప్పిదాలు చేయడం అంటే వారి సీనియారిటీ, నటనను అవమానించడమే అంటున్నారు ఆయన అభిమానులతో పాటు సాధారణ సినీ జనం.

Related Posts