రెహ్మాన్ త‌ర్వాత దేవీ శ్రీ ప్ర‌సాద్ దే ఆ ఘ‌న‌త‌

మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా చాలాచిన్న వ‌య‌సులోనే ఎంట్రీఇచ్చాడు దేవీ శ్రీ ప్ర‌సాద్. మొద‌టి సినిమా దేవితోనే సంచ‌ల‌నాలు మొద‌లుపెట్టాడు. కెరీర్ ఆరంభించిన అతి కొద్ద‌స‌మ‌యంలోనే టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఎదిగాడు. తెలుగుతో పాటు త‌మిళ్ ప‌రిశ్ర‌మ‌లోనూ త‌న‌దైన శైలిలో మెప్పించాడు. ద‌ర్శ‌కుడి టేస్ట్ ను బ‌ట్టి మ్యూజిక్ అందించ‌డం దేవీ శ్రీ ప్ర‌సాద్ స్టైల్. యూత్ ఫుల్ మెలోడీస్ ఇవ్వ‌డంలో అత‌ని త‌ర్వాతే ఎవ‌రైనా అని ప్రూవ్ చేసుకున్నాడు. క‌థాబ‌లం ఉన్న సినిమాల‌కు దేవీ మ్యూజిక్ డబుల్ బూస్ట్ అవుతుంది. అందుకే అత‌ని ఖాతాలో స‌క్సెస్ లే కాదు.. అవార్డులూ ఉన్నాయి. ఇలా ఫిల్మ్ ఫేవ‌ర్ అవార్డ్స్ లో ఓ కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు దేవీ శ్రీ ప్ర‌సాద్. ఏఆర్ రెహ్మాన్ త‌ర్వాత అత్య‌ధిక ఫిల్మ్ ఫేర్ పుర‌స్కారాలు సాధించిన సంగీత ద‌ర్శ‌కుడుగా రికార్డ్ ల‌కెక్కాడు. రెహ్మాన్ కు 10 అవార్డ్ లు వ‌చ్చాయి. లేటెస్ట్ గా పుష్ప చిత్రంతో దేవీ కూడా ద‌శావార్డర్ గా సంచ‌ల‌నం సృష్టించాడు. ఈ లిస్ట్ ఫిల్మ్ ఫేర్ ప్రారంభించిన నాటి నుంచీ ఉండ‌టం విశేషం. అంటే ఈ 64యేళ్ల‌లో అటు హిందీతో పాటు ఇటు సౌత్ లోనూ ఇన్ని ఫిల్మ్ ఫేర్ పుర‌స్కారాలు పొందిన సంగీత ద‌ర్శ‌కులు ఇద్దరే అయితే..ఆ ఇద్ద‌రూ సౌత్ వారే కావ‌డం గొప్ప సంగ‌తి. ఇక రెహ్మాన్ కు ఎక్కువ‌గా హిందీ చిత్రాల‌కు అవార్డ్స్ వ‌చ్చాయి. ఇటు దేవీ సౌత్ మూవీస్ తోనే కొట్టేశాడు.

అంటే ఓ ర‌కంగా సౌత్ నుంచి ప‌దిఫిల్మ్ ఫేర్ పురస్కారాలు పొందిన ఫ‌స్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా దేవీనే చెప్పాలి.ఇక 2005లో వ‌చ్చిన మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం చిత్రంతో మొద‌టిఅవార్డ్ ను అకౌంట్ లో వేసుకున్నాడు దేవీ. ప్ర‌భాస్ తో పాటు త్రిష‌ కు వ‌చ్చిన మొద‌టి బ్లాక్ బ‌స్ట‌ర్ ఈ చిత్రం. ఈ పాట‌లు నేటికీ వినిపిస్తూనే ఉంటాయి.ఆ త‌ర్వాతి యేడాది 2006లో ఏకంగా రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నాడు దేవీ. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రానికి ఒకటి ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడుతో పాటు ఉత్త‌మ నేప‌థ్య సంగీతానికి రెండు పుర‌స్కారాలు అందుకున్నాడు. ఈ రెండు సినిమాలూ ఎమ్మెస్ రాజు నిర్మించిన‌వే కావ‌డం విశేషం.వ‌రుస‌గా మూడో సంవ‌త్స‌రం 2007లో కూడా ఫిల్మ్ ఫేర్ ద‌క్కించుకుని హ్యాట్రిక్ కొట్టాడు దేవీశ్రీ ప్రసాద్. అప్ప‌ట్లో యూత్ ఫుల్ ఫ్యామిలీఎంట‌ర్టైన‌ర్ గా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బొమ్మ‌రిల్లుతో ఈ హ్యాట్రిక్ కంప్లీట్ అయింది. బొమ్మ‌రిల్లు సినిమాకు పాట‌లు ఎంత పెద్ద హైలెట్ అనేది వేరే చెప్ప‌క్క‌ర్లేదు.బొమ్మ‌రిల్లు త‌ర్వాత కాస్త లేట్ అయినా మ‌ళ్లీ వ‌రుస‌గా రెండేళ్లు ఫిల్మ్ ఫేర్ అందుకున్నాడు.

ఈ రెండు సినిమాలూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వే కావ‌డం మ‌రో విశేషం. ఆ రెండు సినిమాలూ 2013లో వ‌చ్చిన‌ గ‌బ్బ‌ర్ సింగ్, 2014లో విడుద‌లైన అత్తారింటికి దారేదీ. ఈ రెండు చిత్రాల‌కూ వ‌రుస‌గా రెండేళ్లు బెస్ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా అవార్డ్ అందుకున్నాడు.మ‌ళ్లీ 2016, 2017 సంవ‌త్స‌రాల్లోనూవ‌రుస‌గా అవార్డ్స్ సాధించాడు దేవీ శ్రీ ప్ర‌సాద్. మ‌హేష్ బాబు హీరోగా న‌టించిన శ్రీమంతుడుతో పాటు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన నాన్న‌కు ప్రేమతో మూవీస్ కు ఫిల్మ్ ఫేర్ వ‌చ్చింది. నాన్న‌కు ప్రేమ‌తో టైటిల్ సాంగ్ ను రాసింది కూడా దేవీనే కావ‌డం మ‌రో విశేషం.2019లో సుకుమార్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన సంచ‌ల‌న చిత్రం రంగ‌స్థ‌లంతో మ‌రోసారి ఫిల్మ్ ఫేర్ పుర‌స్కారం అందుకున్నాడు దేవీ శ్రీ ప్ర‌సాద్. నిజానికి ఈ మూవీపై విడుద‌ల‌కు ముందు భారీ అంచ‌నాల‌ను పెంచిందే దేవీ సంగీతంలోని పాట‌లు. సినిమా కూడా బావుండ‌టంతో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇక లేటెస్ట గా త‌న ప‌ద‌వ ఫిల్మ్ ఫేర్ పుర‌స్కారాన్ని పుష్ప చిత్రానికి అందుకున్నాడు. ఇందులోని ఒక్కో పాటా దేశాన్ని ఊపేసిన‌వే కావ‌డం విశేషం. హీరో ఎంట్రీ సాంగ్ నుంచి లవ్ సాంగ్స్, ఐట‌మ్ సాంగ్, మాంటేజ్ సాంగ్.. అన్నీ అదిరిపోయాయి. మొత్తంగా ఈ పుష్ప మూవీతో రెహ్మాన్ త‌ర్వాత 10 ఫిల్మ్ ఫేర్ పుర‌స్కారాలు అందుకున్న ఓన్లీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా దేవీ శ్రీ ప్ర‌సాద్ స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.

Related Posts