భారీ బడ్జెట్.. అంతకుమించి వారి తారాగణం.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న హీరో.. అలాంటి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటే ఏ రేంజిలో అంచనాలు ఉంటాయో ఊహించడం అంత కష్టమేమీ కాదు. కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఆ మధ్య వచ్చిన ఆది టీజర్ అభాసు పాలయింది.

పైగా దర్శకుడుకి అంతకు ముందే ఒక భారీ సినిమా తీసిన అనుభవం ఉంది. అయినా ఒక పెద్ద హీరోను ఎలా చూపించాలో అర్థం కాలేదు.కనీసం గ్రాఫిక్, విజువల్ ఎఫెక్ట్స్ పైనా అవగాహన కనిపించలేదు. బట్ అంట బడ్జెట్ లేదు.. పెద్ద హీరో కాదు. ఐన ఒక చిన్న టీజర్ టోన్ పాన్ ఇండియన్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ.


తేజ హీరోగా అంతకు ముందు జాంబీ రెడ్డి అనే మూవీ తో సూపర్ హిట్ కొట్టిన ఈ డైరెక్టర్ మరోసారి అదే హీరోతో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు .. వీళ్లకు అంత సీన్ ఉందా అంటూ అవహేళన చేశారు. బట్ ఇప్పుడువాళ్ళే లేటెస్ట్ గా వచ్చిన హనుమాన్ మూవీ టీజర్ చూసి ఔరా .. ఏమి వి ఎఫ్ ఎక్స్ , ఏమి గ్రాఫిక్స్ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.


అంటే కాక ఈ గ్రాఫిక్ష్ తో ప్రభాస్ ఆప్రభాస్ ఆదిపురుష్ గ్రాఫిక్స్ ను కంపేర్ చేస్తూ ఓ రేంజ్ లో సెటైర్స్ వేస్తున్నారు.హనుమాన్ పాన్ ఇండియన్ ప్రాజెక్టు కావడంతో ఆదిపురుష్ తో పాటు బ్రహ్మాస్త్ర మూవీ పైనా దేశ వ్యాప్తంగా సెటైర్స్ పడుతున్నాయి. ఫైనల్ గా కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ అక్కర్లేదని టీజర్ తోనే ఆకట్టుకున్నాడు హనుమాన్. మరి బాక్స్ ఆఫీస్ వార్ లో గెలుపు ఆదిపురుష్ రాముడిదా లేక హనుమాన్ దా అనేది చూడాలి.