ఏ జర్నీ టు కాశీ జనవరి 6న విడుదల

నేటి కాలంలో మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి – ఏ జర్నీ టు కాశీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు శేఖర్ సూరి

వారణాసి క్రియేషన్స్ పతాకం పై చైతన్య రావు, అలెగ్జాండర్ సాల్నికోవ్ , ప్రియా పాల్వాయి, కేటలిన్ గౌడ ముఖ్య తారాగణం తో ముని కృష్ణ దర్శకత్వం లో కె పి లోకనాథ్, దొరడ్ల బాలాజీ మరియు శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం “ఏ జర్నీ టు కాశీ”. ఈ చిత్రం జనవరి 6 న విడుదల అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సభ్యులతో పటు ప్రముఖ దర్శకుడు శేఖర్ సూరి ముఖ్య అతిధిగా విచ్చేసారు.

అనంతరం శేఖర్ సూరి మాట్లాడుతూ “ఈ చిత్రానికి పని చేసిన ఎడిటర్ తిరుపతి రెడ్డి, నా చిత్రాలకి పని చేసాడు. “ఏ జర్నీ టు కాశీ” అనే టైటిల్ చాలా బాగుంది. కాశీ తో నాకు మంచి అనుబంధం ఉంది. 2014 లో షూటింగ్ కోసం నేను కాశీ లో 60 రోజులు ఉన్నాను. ట్రైలర్ చూసాను, చాలా బాగుంది, దర్శకుడి ఉద్దేశం అద్భుతంగా ఉంది అనిపించింది. నేటి కాలంలో మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. శుద్ధోసి బుద్ధోసి పాట చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి మంచి కథ తీసిన దర్శకుడు మరియు నిర్మాతలకి నా కృతఙ్ఞతలు. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చూడాలి. జనవరి 6న విడుదల అవుతుంది. అందరు తప్పకుండా చుడండి” అని తెలిపారు.

దొరడ్ల బాలాజీ గారు మాట్లాడుతూ “మా చిత్రం జనవరి 6 న విడుదల అవుతుంది. మంచి చిత్రం తో మీ ముందుకు వస్తున్నాం. అందరు చుడండి మరియు మా చిత్రాన్ని హిట్ చేయండి” అని కోరుకున్నారు.

శుద్ధోసి బుద్ధోసి పాట పడిన సింగర్ గోమతి అయ్యర్ మాట్లాడుతూ “శుద్ధోసి బుద్ధోసి పాట పాడటానికి నాకు అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్ గారికి మరియు చిత్ర యూనిట్ సభ్యులకి నా కృతఙ్ఞతలు. ఈ చిత్రం మంచి హిట్ అవాలి” అని కోరుకున్నారు.

సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్ మాట్లాడుతూ “ఈ చిత్రంలో ఒక తెలుగు పాట, ఒక సంస్కృత పాట మరియు ఒక ఇంగ్లీష్ పాట చేశాను. ఇలాంటి మంచి చిత్రంలో పని చేయటానికి గొప్పగా ఫీల్ అవుతున్న. చైతన్య సినిమా లో చాలా బాగా చేసాడు. ఈ చిత్రం అందరికి నచ్చుతుంది” అని తెలిపారు.

హీరోయిన్ కేటలిన్ గౌడ మాట్లాడుతూ “ఇది ఒక ఫీల్ గుడ్ సినిమా. చాలా మంచి సినిమా, ఫామిలీ అందరు కలిసి చూసే సినిమా. దర్శకుడు ముని కృష్ణ గారు చాలా బాగా చేసారు. జనవరి 6 న విడుదల అవుతుంది. అందరు చూసి ఆదరిస్తారు అని కోరుకున్నారు.

దర్శకుడు ముని కృష్ణ మాట్లాడుతూ “ఏ జర్నీ టు కాశీ” చిత్రం కాశీ యాత్ర కు సంభందించిన కథ. కాశీ బ్యాక్ డ్రాప్ లో ఒక కుటుంభం కథ ఇది. మేము ఈ చిత్రాన్ని చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. ఎమోషనల్ ఫామిలీ డ్రామా కథ గా ఉంటుంది. జనవరి 6 న తెలంగాణ ఆంధ్ర లో మంచి మంచి థియేటర్స్ లో విడుదల అవుతుంది. అందరు చూసి ఆదరిస్తారు అని కోరుకున్నారు.

Related Posts