ప్రభాస్ తో భారీ మల్టీస్టారర్ ..

ఇప్పుడు ఇండియాలో భాషకో పరిశ్రమ అంటూ ఏం లేదు. ఇండియన్ మూవీస్ అన్నిటికీ సౌత్ సెంటర్ అయిపోయింది. ఏ సినిమా వచ్చినా.. వస్తున్నా.. మన దగ్గర మార్కెట్ అయితేనే వర్కవుట్ అవుతుంది. ఇక మన సినిమాలకు నార్త్ లో తిరుగులేని మార్కెట్ క్రియేట్ అయింది. అందుకే మల్టీస్టారర్స్ కు కూడా హీరోలు వెనకడాటం లేదు.

ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోన్న డార్లింగ్ స్టార్ ప్రభాస్ కూడా త్వరలోనే ఓ భారీ మల్టీ స్టారర్ చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇవి రూమర్స్ మాత్రం కాదు. ఆ భారీ మల్టీస్టారర్ కోసం డార్లింగ్ ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్ ఏ బ్యానర్ లో వస్తోంది.. ప్రభాస్ తో పాటు కనిపించే ఆ మరో హీరో ఎవరు..?


వరుసగా భారీ ప్యాన్ ఇండియన్ మూవీస్ తో దూసుకుపోతున్నాడు ప్రభాస్. బాహుబలితో వచ్చిన క్రేజ్ ను ఓ రేంజ్ లో క్యాష్‌ చేసుకుని ఇప్పుడు ఇండియాస్ టాప్ స్టార్ గా మారిపోయాడు. మధ్యలో రెండు సినిమాలు పోయినా.. అతని రేంజ్ మారలేదు. ప్రస్తుతం మరో క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ మూవీ చేస్తున్నాడు. ఇది చివరి దశలో ఉంది.

నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కే లైన్ లో ఉంది. మారుతితో రాజా డీలక్స్ కూడీ రెడీ అవుతుంది. ఈ మూడు సినిమాలూ పూర్తవడానికి యేడాది పడుతుంది. అంటే 2023లోనే ఈ మూడు సినిమాల షూటింగ్స్ అయిపోతాయి. ముఖ్యంగ సలార్ ఈ యేడాదే రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 28న డేట్ కూడా అనౌన్స్ చేశారు. మిగిలిన సినిమాలు నెక్ట్స్ ఇయర్ వస్తాయి.

అయితే 2024లో ప్రభాస్ తో ఓ భారీ మల్టీస్టారర్ కు రంగం సిద్ధం చేసింది మైత్రీ మూవీస్ బ్యానర్. ఇందుకోసం భారీ అమౌంట్ ను అడ్వాన్స్ గా ఇచ్చారు. ఇప్పటికే కథ కూడా లాక్ చేసి ఉంచారు. కొన్నాళ్ల క్రితం నుంచే దర్శకుడి వేట మొదలుపెట్టి రీసెంట్ గా డైరెక్టర్ ను కూడా ఫిక్స్ చేశారు. బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఈ మల్టీస్టారర్ ను హ్యాండిల్ చేయబోతున్నాడు. ఇతను గతంలో బ్యాంగ్ బ్యాంగ్, ఫైటర్, వార్ అనే భారీ యాక్షన్ మూవీస్ చేసి ఉన్నాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్, దీపికా పదుకోణ్‌ జంటగా పఠాన్ చిత్రాన్నీ రూపొందించాడు.

అతనైతే ప్రభాస్ మల్టీస్టారర్ ను తాము అనుకున్న విధంగా తెరకెక్కిస్తాడని ప్రొడక్షన్ హౌస్ నమ్ముతోంది. ఇక ప్రభాస్ తో పాటు కనిపించే ఆ హీరో ఎవరో తెలుసా. సిద్ధార్థ్ ఆనంద్ గత చిత్రం వార్ లో నటించిన టైగర్ ష్రాఫ్. యస్.. టైగర్ మార్షల్ ఆర్ట్స్ లో మంచి ఎక్స్ పర్ట్. అతనే ప్రభాస్ తో పాటు ఈ మల్టీస్టారర్ లో కనిపించే హీరో. అయితే ఇంకా ఫైనల్ కాలేదు. కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గానే ఈ చిత్రం ఉంటుందట. ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ పై చూడని స్టంట్స్ కూడా ఉంటాయంటున్నారు. మొత్తంగా ప్రభాస్ దూకుడు మామూలుగా లేదన్నమాట.

Related Posts