ధమాకా దర్శకుడికి బంపర్ ఆఫర్

ధమాకాతో మాస్ మహరాజ్ రవితేజను వందకోట్ల హీరోను చేశాడు దర్శకుడు త్రినాథరావు నక్కిన. రవితేజకు ఈ మూవీ ఇచ్చిన బూస్ట్ మామూలుది కాదు. కరెక్ట్ టైమ్ లో పడిన సాలిడ్ హిట్ ధమాకా. అయితే ఈ మూవీకి సంబంధించి అంతా త్రినాథరావే అనడానికి లేదు. అతని రైటర్ గా ప్రసన్న కుమార్ అనే బ్యాక్ బోన్ ఉంది.

ఈ ఇద్దరూ కలిసే ఇప్పటి వరకూ మంచి కమర్షియల్ హిట్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రసన్న కుమార్ వేరే కుంపటి పెట్టుకున్నాడు. అక్కినేని నాగార్జునతో ఓ హిస్టారికల్ మూవీకి దర్శకుడుగా ప్రమోట్ అయ్యాడు. అంటే త్రినాథరావు బ్యాక్ బోన్ ప్రస్తుతం వేరే ప్రాజెక్ట్ కు వెళ్లింది. ఇలాంటి టైమ్ లో ఈ దర్శకుడికి మెగాస్టార్ నుంచి కాల్ వచ్చింది. ఇప్పటి వరకూ తను ఎన్ని హిట్స్ ఇచ్చినా..

సరైన గుర్తింపు, గౌరవానికి నోచుకోలేదు త్రినాథరావు. అలాంటి దర్శకుడికి చిరంజీవి నుంచి ఆఫర్ రావడం అంటే పెద్ద విషయమే. ఇంకా చెబితే త్రినాథరావు మంచి కథ ఇస్తే చేయడానికి చిరంజీవి రెడీగా ఉన్నాడు. అయితే ఈ కాంబినేషన్ ను సెట్ చేస్తున్నది డివివి దానయ్య కావడం విశేషం. నిజానికి ఈ ప్రొడక్షన్ లో ఛలో ఫేమ్ వెంకీ కుడుముల సినిమా చేయాల్సి ఉంది. కానీ వెంకీ కథ చిరంజీవికి నచ్చలేదు. దీంతో ఆ డేట్స్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు అవే డేట్స్ ను త్రినాథరావు నక్కినకు ఇవ్వడానికి చిరంజీవి రెడీగా ఉన్నాడు.

కాకపోతే ఇతను కూడా తన కథతో మెగాస్టార్ ను మెప్పించాల్సి ఉంది. కథ ఓకే అయితేనే పట్టాలెక్కుతుంది. లేదంటే నక్కిన కూడా వెంకీ లా మరో ప్రాజెక్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకూ తనకు సరైన గుర్తింపు రాకపోవడానికి ఓ కారణం ప్రసన్నకుమార్ ముందుండటమే. అందుకే అతను లేకుండానే ఈ ప్రాజెక్ట్ ను ఓకే చేయించుకోవాలనే పట్టుదలతో త్రినాథరావు ప్రస్తుతం కథపై కసరత్తులు చేస్తున్నాడట. మరి మెగాస్టార్ ఓకే అంటే అది త్రినాథరావుకు పెద్ద రిలీఫ్‌ అవుతుందని చెప్పొచ్చు.

Related Posts