టాప్ టెన్ మూవీస్ లో 9 మనవే .. పుష్పకు చోటే లేదు

రీసెంట్ గా ఈ యేడాది ఇండియాస్ టాప్ టెన్ యాక్టర్స్ అంటూ సెన్సేషన్ తో పాటు కాంట్రవర్శీ కూడా క్రియేట్ చేసిన ఐఎమ్.డిబి(ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) ఈ సారి టాప్ టెన్ మూవీస్ లిస్ట్ ను అనౌన్స్ చేసింది. టాప్ యాక్టర్స్ అప్పుడు ప్రభాస్ ను మిస్ చేసిన ఈ సైట్ ఈ సారి మూవీస్ లిస్ట్ లో పుష్పను మిస్ చేసింది. ఇక టాప్ టెన్ మూవీస్ లో తొమ్మిది చిత్రాలూ సౌత్ వే కావడం మాత్రం అరాచకం.

ఇక ఈ లిస్ట్ లో అంతా ఊహించినట్టుగా టాప్ ప్లేస్ లో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ల ఆర్ఆర్ఆర్ ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ ఉంది. రెండు విభాగాల్లో.. ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కు నామినేట్ అయింది. అలాంటి చిత్రం ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలవడంలో ఆశ్చర్యమేం లేదు. కానీ సెకండ్ ప్లేస్ లో కశ్మీర్ ఫైల్స్ నిలవడం మాత్రం ఆశ్చర్యమే. యస్.. ఇక్కడ ఈ చిత్రానికి అంత రేటింగ్ రావడం కొంత విశేషం అనే చెప్పాలి. సినిమాగా ఒన్ సైడెడ్ గా వెళ్లిందీ చిత్రం.

అందుకే రీసెంట్ గా ఇఫీ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు అనర్హత వేటుకు గురైంది. అయినా ఇండియన్స్ ను ఆకట్టకుని ఏకంగా 300 కోట్లు కొల్లగొట్టింది కాబట్టి.. సెకండ్ ప్లేస్ ఇచ్చినట్టున్నారు. మూడో స్థానంలో యశ్ నటించిన కెజీఎఫ్‌ చాప్టర్2 నిలిచింది. ఇది ఎక్స్ పెక్టెడ్ అనుకోవచ్చు. ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా అన్ని భాషల్లో అదరగొట్టింది. ఇలాగే అదరగొట్టిన కమల్ హాసన్ విక్రమ్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఐదో ప్లేస్ లో రీసెంట్ గా వచ్చిన సెన్సేషనల్ మూవీ కన్నడ సినిమా కాంతార నిలవడం విశేషం. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన కాంతార దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.


మాధవన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన మరో ప్యాన్ ఇండియన్ మూవీ రాకెట్రీ ఆరో స్థానంలో నిలిచింది. సెవెంత్ ప్లేస్ లో దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన అడవి శేష్‌ సినిమా మేజర్ నిలిచింది. ఇక విమర్శియల్ గా, కమర్షియల్ గా మెప్పించిన సీతారామంతో పాటు కన్నడ చిత్రం చార్లీ 777 వరుసగా ఎనిమిది, పది గెలుచుకున్నాయి. విశేషం ఏంటంటే.. ఈ రెండు సినిమాలూ ఇతర భాషల్లో పెద్దగా మెప్పించలేకపోయాయి. అయినా లిస్ట్ లో చోటు సంపాదించాయి. ఇక తొమ్మిది స్థానంలో తమిళియన్స్ కు తప్ప వేరెవరికీ కనీసం అర్థం కూడా కాని మణిరత్నం పొన్నియన్ సెల్వన్ తొమ్మిదో స్థానం గెలుచుకుంది.
మొత్తంగా అన్ని భాషల ఆడియన్స్ ను మెప్పించి.. కమర్షియల్ గానూ మంచి విజయమే సాధించిన అల్లు అర్జున్ – సుకుమార్ ల పుష్ప ది రైజింగ్ కు ఈ టాప్ టెన్ లో చోటు లేకపోవడం ఆశ్చర్యంతో కూడిన విశేషం అనే చెప్పాలి.

Related Posts