షణ్ముఖ్ ని ఉతికి ఆరేసిన బోల్డ్ బ్యూటీ సరయు
Latest Reality shows Small Screen Trending News

షణ్ముఖ్ ని ఉతికి ఆరేసిన బోల్డ్ బ్యూటీ సరయు

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తొలి ఎలిమినేషన్ జరిగింది.. హౌజ్ నుండి బయటకు వచ్చేసింది బోల్డ్ బ్యూటీ సరయు.. నామినేషన్స్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ లు ఉన్నా… సరయు ఎలిమినేట్ అయింది.. హౌజ్ నుండి బయటకు వచ్చిన బోల్డ్ బ్యూటీ సరయు.. హౌజ్ లోని కొందరు కంటెస్టెంట్స్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడింది.. ఒక్కొక్కరిపై తూటాల్లాంటి బాంబులు పేల్చింది.. ముఖ్యంగా యూ ట్యూబర్ సరయు, సిరి హనుమంతు, యాంకర్ రవి, వీజే సన్నీపై బుల్లెట్ లాంటి డైలాగులతో దుమ్ము దులిపింది.. హౌజ్ లో తనకు నచ్చని కంటెస్టెంట్స్ ని చెడుగుడు ఆడుకుంది..

బిగ్ బాస్ బజ్ కోసం యాంకర్ అరియానాకి ఇచ్చిన ఇంటర్ వ్యూలో విశ్వరూపం ప్రదర్శించింది సరయు.. ముఖ్యంగా స్టార్ యూ ట్యూబర్ షణ్ముఖ్ పై తన అక్కసు, ఆగ్రహం వ్యక్తం చేసింది.. షణ్ముఖ్ నిజంగా నీలో దమ్ము, ధైర్యం ఉంటే… నువ్వు మగాడివైతే.. లేదా.. గాజులు కూడా వెయ్యను.. నేను గాజులు వేసుకొని కూడా ఒక్కదానినే ఆడతా.. నువ్వు ఇంటిలోకి పోయి మూలన కూర్చో అంటూ రెచ్చిపోయింది.. ఇటు మరో యూ ట్యూబర్ సిరి హనుమంతుపై కూడా అదే స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది బోల్డ్ బ్యూటీ సరయు.. మగాళ్లను అడ్డుపెట్టుకొని ఆటలు ఆడుతోందని తీవ్ర ఆరోపణలు చేసింది..

హౌజ్లోకి ఎంటర్ అయిన మొదటినుండి ఈ ఇద్దరు యూ ట్యూబర్లపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది సరయు.. హౌజ్ బయటే ఈ ఇద్దరు పక్కా ప్లాన్ తో వచ్చారని, ఇక్కడికి వచ్చి కలిసి గేమ్ ఆడుతున్నారని, వారికి దమ్ముంటే విడివిడిగా ఇండివిడ్యువల్ గేమ్ ఆడాలని హితవు పలికింది.. హౌజ్లో అనీ మాస్టర్ తోనూ ఇదే అంశంపై చర్చకు దిగింది..

ఈ ఇద్దరితోనే ఆగలేదు సరయు.. యాంకర్ రవిని సైతం ఓ రేంజ్ లో ఆటాడుకుంది.. మంచోడిలెక్క నీతిసూత్రాలు బోధిస్తాడు కానీ… విషయమే లేదు అని రవి ఫోటోని బ్రేక్ చేసింది.. ఇక వీజే సన్నీపైనా ఘాటు వ్యాఖ్యలు చేసింది.. అసలు కేరక్టరే లేదు అతని దగ్గర అని వ్యాఖ్యానించింది.. ఇక, హౌజ్ లో ఆమె మంచి మార్కులు వేసిన ఏకైక కంటెస్టెంట్ నటుడు విశ్వ.. అవును, నిజమైన మగాడు అని కితాబు ఇచ్చింది..

ఇదంతా బిగ్ బాస్ బజ్ ప్రోమోలోని కంటెంట్ మాత్రమే.. ఇక ఆమె ఇంటర్ వ్యూ మొత్తం బయటకు వస్తే పరిస్థితి ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.. ఇక, సరయుని ఇంటర్ వ్యూని చేసిన అరియానా… ఆమె ఆవేశానికి, ఆగ్రహానికి షాక్ అయింది.. సింపుల్గా చెప్పాలంటే బిత్తరపోయింది.. మరి, ఫుల్ ఇంటర్ వ్యూలో సరయు ఎలాంటి అంశాలు బయటపెట్టిందో చూడాలి..

Post Comment