బ్లాక్ బస్టర్ బాహుబలి(Bahubali)తో ఇండియాస్ టాప్ స్టార్ గా మారాడు ప్రభాస్(Prabhas). తర్వాత వచ్చిన సాహో(Saho) సౌత్ లో ఆడకపోయినా నార్త్ లో అదరగొట్టింది. రాధేశ్యామ్(Radheshyam) అన్ని చోట్లా పోయినా.. ప్రభాస్ (Prabhas) క్రేజ్ తగ్గలేదు.
ప్రస్తుతం ఇండియాలో ఏ స్టార్ కూ లేనంత క్రేజ్ ప్రభాస్ కు ఉందంటే అతిశయోక్తి కాదు. అదే టైమ్ లో ఇండియాలో ఏ స్టార్ కూ లేనంత పెద్ద భారం కూడా ఇప్పుడు అతనిపై ఉంది. అది కూడా ఒకటీ రెండూ కాదు.. ఏకంగా నాలుగు వేల కోట్లకు పైనే రాబట్టాల్సిన భారీ భారం ఉంది. మరి అదెలాగో చూద్దాం..
ప్రభాస్ (Prabhas) నటించిన ఆదిపురుష్(Adipurush) జూన్ 16న విడుదల కాబోతోంది. ఓమ్ రౌత్(Om Routh) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది.
అయితే థియేటర్స్ నుంచి వెయ్యి కోట్ల వసూలు చేయాలనే టార్గెట్ తో రిలీజ్ అవుతోంది. సినిమాపై భారీ అంచనాలు లేవు. అయినా కేవలం ప్రభాస్(Prabhas) క్రేజ్ తోనే ఆ వసూళ్లు రావాలనే టార్గెట్ తో మేకర్స్ ఉన్నారు. సో ఈ జూన్ తర్వాత డార్లింగ్ (Darling) వెయ్యి కోట్లు రాబట్టాలన్నమాట.
ఇక సెప్టెంబర్ 28న సలార్(Salar) విడుదలవుతోంది. ఇది కూడా భారీ బడ్జెట్ తోనే తెరెక్కింది. ఇక్కడ ప్రభాస్ తో పాటు ప్రశాంత్ నీల్(Prashanth Neel) క్రేజ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి వీళ్లూ వెయ్యి కోట్ల టార్గెట్ తో ముందుకు రాబోతున్నారు. ఇంకా చెబితే ఎక్కువే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే అది ఆదిపురుష్ సక్సెస్ పై కొంత డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రశాంత్ నీల్ సోలోగానే కేజీఎఫ్(KGF) తో అదరగొట్టాడు కాబట్టి.. ఇప్పుడు ప్రభాస్ తో కలిసి ఆ ఫిగర్ సాధించడం పెద్ద కష్టమేం కాదు.
ఇక మళ్లీ ఒంటి చేత్తోనే ప్రభాస్ సాధించాల్సిన సినిమా ప్రాజెక్ట్ కే(Project K). ఈ చిత్రానికి సంబంధించి ప్రభాస్ తప్ప దర్శకుడు, నిర్మాణ సంస్థ ఇలా ఏదీ ప్యాన్ ఇండియన్ రేంజ్ లో కలిసి రాదు. దీపికా పదుకోణ్(Deepika Padukone) హీరోయిన్ గా నటిస్తున్నా.. ప్రధానంగా ప్రభాస్(Prabhas) వల్లే ఓపెనింగ్స్ రావాల్సి ఉంటుంది. ఇక నాగ్ అశ్విన్(Nag Aswin) డైరెక్షన్ లో అశ్వనీదత్(Aswani Dutt) నిర్మిస్తోన్న ప్రాజెక్ట్ కే వచ్చే సంక్రాంతికి విడుదలవుతుంది.
ఈ చిత్రాన్ని కూడా భారీగా 500 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ తో వస్తోందని చెబుతోన్న ఈ మూవీతో 2వేల కోట్ల వసూళ్లు సాధించాలనేది టార్గెట్. ఈ మేకర్స్ కు ఉన్న నమ్మకం అయితే అది ఖచ్చితంగా వస్తుందనుకుంటున్నారు. బట్ అదేమంత సులువు కాదు. సలార్ కు ఆదిపురుష్ సక్సెస్ అవసరం అన్నట్టే ఈ రెడు సినిమాల సక్సెస్ ప్రాజెక్ట్ కే కూ అవసరం. అంటే ఆదిపురుష్, సలార్ బ్లాక్ బస్టర్ అయితే ఆటోమేటిక్ గా ప్రాజెక్ట్ కే రెండు వేల కోట్ల మార్క్ ను టచ్ చేస్తుంది. సో.. ఈ మూడు సినిమాలతో ఏకంగా 4వేల కోట్ల రూపాయల వసూళ్లు సాధించాలి. అది కూడా ప్రధానంగా ప్రభాస్ ఇమేజ్ తోనే.
ఇక సందట్లో సడేమియాల.. ఈ మూడూ హిట్ అయితే అనుకోకుండా అదనంగా మారుతి(Maruthi) సినిమాకు కలిసొస్తుంది. ఈ మూవీ మీడియం బడ్జెట్ లోనే తెరకెక్కుతుంది. ప్రభాస్ రెమ్యూనరేషన్ లో సగం కూడా మేకింగ్ కు ఖర్చు అవదు అని చెబుతున్నారు. బట్ ఆ మూడు సినిమాల విజయం ఈ మూవీని నెక్ట్స్ రేంజ్ లో నిలబెడుతుంది. బడ్జెట్ ఎలా ఉన్నా.. హిట్ టాక్ తెచ్చుకుంటే.. మారుతి డైరెక్ట్ చేస్తోన్న సినిమా కూడా సులువుగా 500 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుంది.
ఒకవేళ ఆ మూడు సినిమాల్లో ఏదైనా అనుకున్న రేంజ్ లో పర్ఫార్మ్ చేయకపోతే ఈ మూవీ కవర చేస్తుంది. అలా చూసినా ప్రభాస్ పై 4వేల కోట్ల భారం ఉంది. మరి ఈ బిగ్గెస్ట్ టాస్క్ ను అతను ఛేదిస్తే.. ఇండియాలో ప్రభాస్(Prabhas) దరిదాపుల్లోకి వచ్చే హీరో ఇప్పట్లో ఉండడు.