ఏడు రోజులు 30 కోట్లు

సక్సెస్ అంటే నిర్మాతల కళ్లలోనూ, సినిమాలు కొన్నవారిలోనూ ఆనందం కనిపించడమే. ఎన్ని కోట్లు వచ్చాయి అనేది కాదు. తీసిన వారికి, కొన్నవారికి ఎంత లాభం వచ్చింది అనేది తేలినప్పుడే అసలైన సక్సెస్. ఈ మధ్య కాలంలో అలాంటి సక్సెస్ ను చూసిన సినిమా సామజవరగమన.

శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నరేష్‌, వెన్నెల కిశోర్, రఘుబాబు, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకుడు. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించాడు. విడుదలకు ముందే వీళ్లు ప్రమోషనల్ స్ట్రాటజీగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేశారు. ఆ ప్రీమియర్స్ కే అద్భుతమైన స్పందన వచ్చింది.

రిలీజ్ డే రోజు మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది సామజవరగమన. ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక జెన్యూన్ కామెడీ ఎంటర్టైనర్ గా.. అదీ క్లీన్ కామెడీతో వచ్చిన సినిమాగా ఈ చిత్రానికి ప్రేక్షకులు పట్టం కట్టారు. కేవలం మౌత్ టాక్ తోనే రోజు రోజుకూ కలెక్షన్స్ పెరిగాయి. గత గురువారం విడుదలైన ఈ మూవీ ఇప్పటికే లాభాల్లోకి వచ్చేసింది. కొన్నవాళ్లంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి సక్సెస్ కోసం చాలా రోజుల నుంచి చూస్తోన్న శ్రీ విష్ణు సైతం ఫుల్ ఖుషీగా ఉన్నాడు.


ఇక ఏడు రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల కలెక్షన్స్ వసూలు అయ్యాయి. ఆశ్చర్యం ఏంటంటే.. అసలు ఈ చిత్రాన్ని ఓవర్శీస్ లో కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. తర్వాత సందీప్ కిషన్ భైరవ కోనతో కలిపి కొంతమంది తీసుకున్నారు. బట్ ఇప్పుడు అక్కడ చాలాకాలం తర్వాత భారీ లాభాలు తెచ్చిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే హాఫ్ మిలియన్ క్లబ్ లోకి ఎంటర్ అయిన ఈ మూవీ ఈ వీకెండ్ వరకూ నిలిస్తే ఒన్ మిలియన్ క్లబ్ లోకి కూడా ఎంటర్ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇప్పటికే అక్కడి వారికి ఈ చిత్రం కోటికి పైగా లాభాలు తెచ్చింది. దీనికి తోడు ఇప్పుడు భైరవ కోన సినిమా ఫ్రీగా వచ్చింది.


ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది ఈ మూవీ. ఈ వారం వచ్చే సినిమాల్లోనూ కొన్ని కామెడీ ఎంటర్టైనర్స్ ఉన్నాయి. అవి ఈచిత్రానికి దీటుగా కనిపిస్తే కొంత కలెక్షన్స్ తగ్గొచ్చు. లేదంటే మరింత పెరుగుతాయి. మొత్తంగా ఓ చిన్న సినిమా ఇంత పెద్ద విజయం సాధించి చాలా రోజులే అవుతుందని చెప్పాలి. ఏదేమైనా కంటెంట్ కు ఉండే వాల్యూ ఇది

Related Posts