క్రేజీ హీరోయిన్ గా టాలీవుడ్ లో తిరగులేని వేగంతో దూసుకుపోతోంది పూజాహెగ్డే. తను తెలుగులో ఎంట్రీ ఇచ్చిన టైమ్ లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన దువ్వాడ జగన్నాథమ్ లో అమ్మడి బికిని షోకు టాలీవుడ్ పడిపోయింది. అప్పటి నుంచి స్టార్ హీరోలంతా వరుసగా చాన్స్ లు ఇచ్చారు. రంగస్థంలో ఐటమ్ సాంగ్ చేసినా సినిమాకు వచ్చినంత క్రేజ్ వచ్చింది. వెంటనే అరవింద సమేత వీరరాఘవలో ఏకంగా తనతోనే డబ్బింగ్ చెప్పించాడు త్రివిక్రమ్.

అలా టాప్ రేస్ లోకి వచ్చింది. అల వైకుంఠపురములోతో దేశవ్యాప్తంగా పాపులారిటీ కూడా తెచ్చుకుంది. అప్పటి నుంచి బుట్టబొమ్మగా పిలుచుకుంటోన్న ఈ డస్కీ బ్యూటీ 2021లో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో మంచి నటన కూడా చూపించి ఆకట్టుకుంది. ఆ సినిమా విజయంలో మేజర్ షేర్ తనదే అంటే అతిశయోక్తి కాదు. ఆ ఉత్సాహంతో 2022లోకి ఎంట్రీ ఇచ్చింది. బట్ ఈ యేడాది అమ్మడికి భారీ షాక్ తగిలింది.


ఈ యేడాది మార్చి 11న భారీ అంచనాలతో వచ్చిన రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా తేలింది. నిజానికి ఈ మూవీ విషయంలో మొదటి నుంచి తను డౌట్ గానే ఉంది. అందుకే కొన్ని సీన్స్ ను డూప్ తోనే కానిచ్చారు అంటారు. అలా ఇయర్ ఆరంభంలోనే ప్యాన్ ఇండియన్ షాక్ తిన్నది పూజా.

ఇక వేసవి బరిలో కోలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ అక్కడి స్టార్ హీరో విజయ్ తో చేసిన బీస్ట్ సైతం డిజాస్టర్ అయింది. ఈ మూవీలో తన పాత్ర పరిమితమే. అయితేనేం అరంగేట్ర మూవీ కావడంతో అందరి దృష్టీ తనపైనే ఉంది. అందుకే ఈ ఫెయిల్యూర్ తో తనను కూడా ట్రోల్ చేశారు.


బీస్ట్ తో పాటు చేయాలా వద్దా అనే డైలమాలోనే చేసేసిన ఆచార్యతో మరో డిజాస్టర్ పడింది. రామ్ చరణ్‌ కు జోడీగా నటించిన ఈ మూవీలోనూ తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ అటు చిరంజీవికి హీరోయిన్ లేకపోవడంతో ఆటోమేటిక్ గా ఆ ప్లేస్ అమ్మడికే వచ్చింది. అలా మరో డిజాస్టర్ చూడాల్సి వచ్చింది. దీంతో హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది.


ఇక ఫినిషింగ్ అయినా బావుంటుంది అనుకుంటే ఈ శుక్రవారం వచ్చిన హిందీ సినిమా సర్కస్ బాలీవుడ్ లో ఆల్ టైమ డిజాస్టర్స్ ల లిస్ట్ లో చేరింది. ఈ మూవీలో చాలామంది ఆర్టిస్టులే ఉన్నా.. తను గుంపులో గోవిందమ్మ లా కనిపించినా.. మెయిన్ హీరోయిన్ ఫేస్ తనదే. దీంతో నాలుగో డిజాస్టర్ పడింది. మొత్తంగా ఈ బుట్టబొమ్మ ఈ యేడాది 4 డిజాస్టర్లు చూసిందన్నమాట.

మరి వచ్చే యేడాది త్రివిక్రమ్ – మహేష్‌ మూవీతో పాటు సల్మాన్ ఖాన్ సరసన కిసీ కా భాయ్ కిసి కీ జాన్ అనే సినిమా చేస్తోంది. ఇది తమిళ్ వేదాళం మూవీకి రీమేక్. సో ఈ మూవీ రిజల్ట్ ముందే ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఇక తన గురువు త్రివిక్రమ్ పైనే ఆశలు పెట్టుకుందని చెప్పొచ్చు.