20 ఏళ్ల ‘మనసంతా నువ్వే’
Latest Movies Tollywood

20 ఏళ్ల ‘మనసంతా నువ్వే’

తెలుగు తెరపై కొన్ని ప్రేమ కథలు అలా గుర్తుండిపోయాయి. అలాంటి మెమొరబుల్ లవ్ స్టోరి మనసంతా నువ్వే. అను, వేణుల ఈ ప్రేమ కథ ఒకతరం జ్ఞాపకాల్లో ఒకటైంది. 2001 అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకొచ్చిన మనసంతా నువ్వే సినిమా ఘన విజయాన్ని సాధించింది. అప్పటికే చిత్రం, నువ్వు నేను లాంటి వరుస హిట్స్ అందుకున్న యంగ్ హీరో ఉదయ్ కిరణ్ కు హ్యాట్రిక్ హిట్ ఇచ్చిందీ సినిమా. సుమంత్ ఆర్ట్స్ సంస్థకు భారీ సక్సెస్ అందించింది. అప్పటికి ఇబ్బందుల్లో ఉన్న నిర్మాత ఎంఎస్ రాజును నిర్మాతగా నిలబెట్టింది మనసంతా నువ్వే. అను క్యారెక్టర్ లో రీమా సేన్ యూత్ కు డ్రీమ్ గర్ల్ అయ్యింది.

దూరం ఎడబాటు కల్పించినా, సామాజిక స్థితిగతులు వేరు చేసినా అను వేణు తమ చిన్ననాటి స్నేహాన్ని ప్రేమగా నిలబెట్టుకున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. వేణు స్నేహితుడి పాత్రలో సునీల్ వినోదం నవ్వించింది. మనసంతా నువ్వే సినిమా సునీల్ ను స్టార్ కమెడియన్ ను చేసింది. ఆర్పీ పట్నాయక్ సంగీతం, పరుచూరి సోదరుల మాటలు, వీఎన్ ఆదిత్య దర్శకత్వ ప్రతిభ ఓ ఫ్రెష్ లవ్ స్టోరిని తెరపై ఆవిష్కరించింది. మనసంతా నువ్వే రిలీజ్ అయ్యి అప్పుడే 20 ఏళ్లు అవుతోందా అన్నంత గుర్తుండిపోయిందీ సినిమా.

Post Comment