ఏ ఆర్ రెహ్మాన్ రాంగ్ ఛాయిస్ అనిపిస్తోందా..?

మణిరత్నం.. ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ పేరుకు ఓ బ్రాండ్ ఉంది. ఫిల్మ్ మేకింగ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లిన దర్శకుల్లో మొదటి వరుసలో ఉంటాడు మణిరత్నం. అందుకే మణిరత్నం నుంచి ఓ సినిమా వస్తోందంటే కంట్రీ మొత్తం ఈగర్ గాచూస్తుంది. కొన్నాళ్లుగా సరైన విజయాలు లేకపోయినా మేకింగ్ లో ఆయన్ని కొట్టేవారే లేరంటారు. అలాంటి మణి ఇప్పుడు ఓ హిస్టారికల్ మూవీతో వస్తున్నాడు. రెండు భాగాలుగా వస్తోన్న ఈచిత్రం పొన్నియన్ సెల్వన్. పి.ఎస్. 1 అనే పేరుతో పిలిచుకుంటోన్న ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
పొన్నియన్ సెల్వన్ 1.. భారీ తారాగణంతో మణిరత్నం రూపొందిస్తోన్న చిత్రం ఇది. ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. కార్తీ ప్రధానంగా కనిపించిన ఈ పాటను సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ ఆలపించాడు. చాలా రోజుల తర్వాత రెహ్మాన్ నుంచి తెలుగు పాట వింటున్నాం. పొంగే నది పాడినది.. చిందులేయ్ రా.. చేరమని కోరినది సందె కళ్లా.. అంటూ సాగే ఈ సాంగ్ ను తెలుగులో అనంత శ్రీరామ్ రాశాడు. అయితే తెలుగు బాగానే తెలిసి ఉన్నా.. ఎందుకో కొన్ని పదాలను రెహ్మాన్ సరిగా ఉచ్చరించలేదేమో అనిపిస్తున్నా.. చాలా పదాల అర్థాలు పూర్తిగా మారిపోయేలా రెహ్మాన్ గాత్రం పలికింది. మరి రాసిన వారిని దగ్గర పెట్టుకుని ఉంటే ఈ తప్పులు దొర్లేవి కావేమో. అయితే ట్యూన్ మాత్రం ఆకట్టుకుంటుంది. సిట్యుయేషన్ తో కలిపి చూస్తే పాట అలరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చోళ వంశ రాజులు, రాజ్యాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, ప్రభు, శరత్ కుమార్, జయం రవి, శోభిత దూళిపాళ్లతో పాటు ఇంకా చాలామంది ఆర్టిస్టులున్నారు. మరి వీరందరికీ సరైన పాత్రలు ఉంటాయా లేదా అనేది అప్పుడే చెప్పలేం కానీ ఆమధ్య విడుదల చేసిన టీజర్ ఆకట్టుకున్నా.. ఎందుకో తమిళ నేటివిటీ ఎక్కువగా ఉందనిపించింది. ఆ బౌండరీస్ ను దాటి అందరినీ మెప్పించగలిగితే పొన్నియన్ సెల్వన్ 1 సూపర్ హట్ అనిపించుకుంటుంది. ఇక సినిమాను సెప్టెంబర్ 30న విడుదల చేయబోతున్నారు.

Related Posts