‘సలార్’ కలెక్షన్స్.. మూడు రోజుల్లో 402 కోట్లు

వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద ‘సలార్’ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. మొదటి రోజు రూ.178.7 కోట్లు కొల్లగొట్టిన ‘సలార్’ రెండో రోజుకు రూ.295 కోట్లు వసూళ్లను దాటిపోయింది. లేటెస్ట్ గా ‘సలార్’ మూడు రోజుల వసూళ్ల వివరాలు బయటకు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజులకు గానూ రూ.402 కోట్లు కలెక్ట్ చేసింది ఈ చిత్రం. విడుదలైన మూడు రోజులకే ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. అది రెబెల్ స్టార్ ప్రభాస్ కే సాధ్యమైంది అంటున్నారు అభిమానులు.

క్రిస్మస్ సీజన్ కలిసిరావడంతో ‘సలార్’కి లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ గా మారింది. ఈరోజు (సోమవారం) కూడా బాక్సాఫీస్ వద్ద ‘సలార్’ ప్రభంజనం భారీ స్థాయిలోనే ఉండబోతుంది. ఈ రీతిన వసూళ్ల వర్షం కురిస్తే.. త్వరలోనే వెయ్యి కోట్లు మార్కును ఈజీగా అందుకోనుంది ‘సలార్’.

Related Posts