సమంత చేతిలో చేతిలో దండ..సమస్యలను పరిష్కరిస్తుందా ..??

మయోసిటిస్ అనే వ్యాధి బారి నుంచి సమంత కోలుకుంటోంది. గతంలో యశోద సినిమా ప్రమోషన్ టైం తో పోలిస్తే లేటెస్ట్ గా జరిగిన శాకుంతలం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ల్లో కాస్త ఉత్సాహంగా కనిపించింది. కళ్ళల్లో బాధని దిగమింగుతున్నట్టుగానూ ఉంది. తాను మాట్లాడుతున్నప్పుడు… గుణశేఖర్ తన గురించి చెబుతున్నప్పుడు.. భావోద్వేగానికి గురవుతూ కన్నీటిని దాచుకునే ప్రయత్నం చేయడం అక్కడి అభిమానులందరినీ కదిలించింది.


అయితే ఈ కార్యక్రమం తో పాటు రీసెంట్ గా తనను ముంబై ఎయిర్పోర్ట్ లో చూసినప్పుడు ఆమె చేతిలో ఒక జపమాల కనిపించింది. మనసు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ జపమాలను తిప్పుతూ మంత్రాలు చదవడం అనేది హిందూతో పాటు క్రైస్తవ మతాల్లోనూ ఉంది. ప్రస్తుతం సమంత కూడా మానసిక ప్రశాంతత కోసం ఈ జపమాలను తరచూ ఉపయోగిస్తూ ప్రార్థనలు చేసుకుంటోంది. తాను ఎక్కడ ఉన్నా ఈ మాలతోనే కనిపిస్తోంది. అయితే ఈ మాలలో లక్ష రుద్రాక్షలు ఉన్నాయని అవన్నీ పూర్తి చేయడమే లక్షయంగా సామ్ ఆ మంత్రాలను పాటిస్తోంది అని కూడా చెబుతున్నారు. ఏదో ఒకటి.. మందులో మంత్రాలో సమంత కు పూర్తిగా నయమయ్యి మల్లి మంచి పాత్రలతో మనల్ని అలరించాలని కోరుకుందాం.

Related Posts