బాక్సాఫీస్ వద్ద స్టార్స్ వార్స్ ఎప్పుడూ క్రేజీగానే ఉంటాయి. కానీ బడ్జెట్ లు భారీగా ఉండటంతో స్టార్ వార్ కంటే ప్రొడ్యూసర్స్ కాంప్రమైజింగ్స్ వల్ల ఆడియన్స్ ఈ క్రేజీనెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అయినా పెద్ద పండగలు వచ్చినప్పుడు పెద్ద సినిమాలే వస్తుండటం సంప్రదాయంగా మారింది. ఆ సంప్రదాయంలోనే ఒకటి రెండు రోజులు అటూ ఇటూగా రిలీజ్ లు పెడుతున్నారు మేకర్స్.

కొన్నాళ్లుగా లేదు కానీ.. దసరా టైమ్ లో మరీ బిగ్గెస్ట్ స్టార్ వార్ ఈ మధ్య కాలంలో జరగలేదు. ఈ యేడాదే చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ఘోస్ట్ వచ్చాయి. బట్ ఏదీ పెద్ద బజ్ ను క్రియేట్ చేయలేదు. అయితే వచ్చే దసరా అలా కాదు. ఓ రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది. అది కూడా టాలీవుడ్ టాప్ త్రీ హీరోస్ మధ్య.


యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా 2023 దసరాకే విడుదల అని ఇప్పటికే ఇన్ డైరెక్ట్ గా ఫిక్స్ అయిపోయారు. ఇప్పటి వరకూ ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు కానీ.. ఒక్కసారి షూటింగ్ షురూ అయితే ఇంక ఆగేదే లేదు అన్నట్టుగా చాలా వేగంగా ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసేలా ప్లానింగ్ చేసుకున్నారు. ఆ ప్లానింగ్ ఖచ్చితంగా దసరాకు విడుదల చేయాలి అన్నట్టుగానే ఉంది అని స్ట్రాంగ్ బజ్ ఉంది.

2018లో దసరాకు అరవిందే సమేతతో వచ్చాడు ఎన్టీఆర్. మరి ఈ సారి దేవరగా వస్తాడన్నమాట. అయితే ఎన్టీఆర్ కు పోటీగా రామ్ చరణ్ కూడా బరిలో ఉన్నాడు.


ఆర్ఆర్ఆర్ తో మంచి ఫ్రెండ్స్ మారిన వీరి మధ్య బాక్సాఫీస్ ఫైట్ జరగబోతోంది.
రామ్ చరణ్ – శంకర్ సినిమాను మామూలుగా ఈ సంక్రాంతికి విడుదల చేస్తారు అనుకున్నారు. బట్.. శంకర్ ఖచ్చితంగా భారతీయుడు 2 పూర్తి చేయాల్సి రావడంతో ఈ మూవీకి బ్రేక్ పడింది. అప్పుడప్పుడూ కొన్ని సీన్స్ ను మాత్రం షూట్ చేస్తున్నారు. అయినా సమ్మర్ కు కూడా రెడీ కావడం దాదాపు అసాధ్యం అని చెబుతున్నారు. ఎందుకంటే భారతీయుడు సినిమాకు సంబంధించిన వర్క్ ఇంకా చాలా ఉంది.

పైగా ఆ మూవీకి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కూడా చాలానే ఉన్నాయి. దీంతో సమ్మర్ వరకూ ఎక్కువగా కమల్ హాసన్ సినిమాకే ప్రాధాన్యం ఇస్తాడు శంకర్. అప్పటికి చరణ్‌ మూవీ కొంత షూటింగ్ జరుపుకున్నా.. సమ్మర్ లో రిలీజ్ చేయడం ఇంపాజిబుల్. సో.. ఈ చిత్రాన్ని కూల్ గా దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో రామ్ చరణ్‌ డ్యూయొల్ రోల్ చేస్తున్నాడు.


ఇక వీరితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా దసరా బరిలోనే నిలవబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఫస్ట్ మొదలైన మూవీని ఏప్రిల్ లో విడుదల చేస్తాం అని డేట్ కూడా అనౌన్స్ చేశారు. బట్ ఆ కథ మారింది. దీంతో కొంత ఆలస్యంగా షూటింగ్ మొదలవుతుంది.

కానీ ఈలోగానే కృష్ణగారు చనిపోవడంతో మహేష్‌ షూటింగ్ లో జాయిన్ కావడానికి మరింత టైమ్ పడుతుంది. అందువల్ల సమ్మర్ రిలీజ్ సాధ్యం కాదు. సో.. ఆ తర్వాత ఉన్న పెద్ద సీజన్ దసరానే కాబట్టి.. వీళ్లూ ఆ టైమ్ కే రిలీజ్ టార్గెట్ గా షూటింగ్ చేసుకుంటారు అనేది కొత్తగా వినిపిస్తోన్న వార్త. సో.. టాలీవుడ్ టాప్ స్టార్స్ మధ్య జరగబోతోన్న ఈ ట్రైయాంగిల్ ఫైట్ లో విన్నర్ ఎవరు అనేది చూడాలి.