లియో వసూళ్లు బాగానే ఉన్నాయి

దసరా బరిలో వచ్చిన సినిమాల్లో ‘భగవంత్ కేసరి‘ చిత్రానికి మాత్రమే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. నిన్న వచ్చిన ‘లియో‘.. నేడు విడుదలైన ‘టైగర్ నాగేశ్వరరావు‘ సినిమాలు ఏవరేజ్ టాక్ తో సరిపెట్టుకున్నాయి. ఏవరేజ్ టాక్ వచ్చినా వసూళ్ల విషయంలో మాత్రం ‘లియో‘ అదరగొట్టిందనే చెప్పాలి. తమిళనాడు లో ‘లియో‘ అద్భుతమైన వసూళ్లు సాధించడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ.. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా ఊహించని రీతిలో కలెక్షన్లను కొల్లగొట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో ‘లియో‘ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ రిలీజ్ చేసింది. దీంతో.. ఇక్కడ భారీ స్థాయిలో థియేటర్లు దక్కాయి. దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ క్రేజ్ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి అదిరిపోయే ఓపెనింగ్స్ దక్కాయి. అలా.. తొలిరోజు ‘లియో‘ తెలుగులో ఏకంగా రూ. 16 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. విజయ్ అనువాద సినిమాల్లోనే ఇదొక రికార్డు అని చెప్పొచ్చు.

Related Posts