మెగా మూవీకి టెక్నికల్ టీమ్ కుదిరింది

‘భోళా శంకర్’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి రెండు సినిమాలను అనౌన్స్ చేశాడు. చిరు బర్త్ డే స్పెషల్ గా ప్రకటించిన ఆ చిత్రాలలో మెగా 156 కి కళ్యాణ్ కృష్ణ.. మెగా 157 కి వశిష్ట డైరెక్టర్స్. అయితే.. ఇప్పుడీ ఆర్డర్ మారింది. కళ్యాణ్ కృష్ణ సినిమాకి కథ ఫైనల్ కాకపోవడంతో వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కాల్సిన మెగా 157 కాస్తా ఇప్పుడు మెగా 156 గా మారింది.

యు.వి.క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో మెగా 156 సినిమాని నిర్మిస్తుంది. దసరా స్పెషల్ గా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘మెగా మాస్ బియాండ్ యూనివర్శ్’ అనే పవర్ ఫుల్ వర్డ్స్ తో రిలీజైన ఈ పోస్టర్ లో త్రిశూలం ఆకట్టుకుంటుంది. చిరంజీవి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహాలో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ మెగా మూవీలో నటించే ఇతర నటీనటుల సంగతి గురించి ఎలాంటి క్లారిటీ లేకపోయినా.. టెక్నికల్ టీమ్ విషయంలో పర్ఫెక్ట్ క్లారిటీ ఇచ్చింది టీమ్. ఈ సినిమాకి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. దాదాపు ముఫ్ఫై ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమాకి మళ్లీ మ్యూజిక్ ఇస్తున్నాడు కీరవాణి. గతంలో చిరంజీవితో పలు సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన చోటా కె. నాయుడు ఈ మూవీకి సినిమాటోగ్రఫీ సమకూర్చబోతున్నాడు. ఇంకా.. సాయిమాధవ్ బుర్రా, ఎ.ఎస్.ప్రకాష్, కోటగిరి వెంకటేశ్వరరావు వంటి టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పనిచేయబోతున్నారు. మొత్తంమీద ‘భోళా శంకర్’ ఫ్లాపుతో ఢీలాపడ్డ మెగాస్టార్ మళ్లీ మెగా 156తో ఫుల్ ఫామ్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

Related Posts