యువత అనే సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు పరశురామ్. అంతకు ముందు పూరీ జగన్నాథ్ వద్ద పనిచేశాడు. యువత మూవీ పూర్తిగా పూరీ మార్క్ లో సాగే ఎంటర్టైనర్. దీంతో కొన్ని విమర్శలు వచ్చాయి. తర్వాత సోలో మూవీతో మంచి విజయం అందుకున్నాడు. ఈ మూవీతో సెన్సిబుల్ ఇష్యూస్ ను బాగా డీల్ చేశాడు అనే పేరు తెచ్చుకున్నాడు. అటు ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా మెప్పించాడు. తర్వాత కొన్ని సినిమాలు చేసినా గీత గోవిందంతో స్టార్ రేస్ లోకి వచ్చాడు.

ఈ మూవీ వంద కోట్లు సాధించింది. అయితే గీత గోవిందం తర్వాత అతనికి చాలామంది నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చారు అని చెబుతారు. అలా ఇచ్చిన అడ్వాన్స్ లు అన్నీ తీసుకున్నాడు అన్నారు. అలా 14రీల్స్ బ్యానర్ లో కూడా అడ్వాన్స్ తీసుకుని నాగ చైతన్యతో సినిమా చేయాలి. ఈ లోగా మహేష్‌ బాబుతో అవకాశం వచ్చింది. దీంతో చైతన్యను ఒప్పించి.. మహేష్‌ తో సర్కారువారి పాట సినిమా చేశాడు. కంటెంట్ పరంగా యావరేజ్ అయినా కలెక్షన్స్ పరంగా 200 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. కట్ చేస్తే మళ్లీ నాగ చైతన్యతో సినిమా చేస్తాడు అనుకుంటే చైతూ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ గా లేడు అని చెప్పడంతో అతను తర్వాత దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నాడు అనే హింట్ ఇచ్చారు.

అంతే అంతకంటే ముందే తన వద్ద అడ్వాన్స్ తీసుకున్న పరశురామ్ దిల్ రాజుతో సినిమా ఎలా చేస్తాడు అంటూ అల్లు అరవింద్ ఆవేశంగా ప్రెస్ మీట్ పెడతా అన్నాడు. తర్వాత అది ఆగిపోయింది. ఇదే టైమ్ లో పరశురామ్ చాలామంది వద్ద అడ్వాన్స్ లు తీసుకుని నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాడు అనే టాక్ వచ్చింది. అవన్నీ ఎలా ఉన్నా ఇప్పుడు ఇదే దర్శకుడు తమిళ్ స్టార్ హీరో కార్తీతో సినిమా చేయబోతున్నాడు అనే టాక్ వచ్చేసింది. కార్తీకి తెలుగులో మంచి ఇమేజ్ ఉంది.

మార్కెట్ కూడా ఉంది. పైగా ఊపిరి అనే స్ట్రెయిట్ తెలుగు మూవీ కూడా చేసి ఉన్నాడు. ప్రస్తుతం వరుస మూవీస్ తో ఉన్నాడు కార్తీ. త్వరలోనే అతని 25వ సినిమా రాబోతోంది. అది పరశురామ్ డైరెక్షన్ లో నే ఉంటుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. దీంతో ఈ వార్త వచ్చిన దగ్గర్నుంచీ ఇప్పటి వరకూ పరశురామ్ పై నెగెటివ్ గా మాట్లాడిన వాళ్లంతా .. నోరెళ్లబోతుడున్నారు. ఏదేమైనా ఇదే నిజమైతే ప్రస్తుతం అతని గురించి తప్పుడుగా మాట్లాడిన నిర్మాతలంతా ఇంక మూసుకోవాల్సిందే. లేదంటే తమ మేటర్స్ సెటిల్ చేసుకోవాల్సిందే.