ఆ ఇద్దరితోనూ అనిల్ రావిపూడి

రైటింగ్ డిపార్ట్ మెంట్ నుంచి డైరెక్టర్స్ గా మారితే తిరుగుండదు అని నిరూపించిన వారిలో బెస్ట్ ఎగ్జాంఫుల్ అనిల్ రావిపూడి. తన మార్క్ కామెడీని జొప్పించి కమర్షియల్ యాంగిల్ లో సూపర్ హిట్స్ అందుకోవడం అనిల్ రావిపూడి స్పెషాలిటీ. ఇప్పటికే అరడజను హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్న అనిల్ దసరా బరిలో ‘భగవంత్ కేసరి‘తో వస్తున్నాడు.

‘భగవంత్ కేసరి‘ తర్వాత అనిల్ రావిపూడి ఎవరితో పనిచేయబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే.. అందరి హీరోలతోనూ సినిమాలు చేయాలని ఉందన్న అనిల్ మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో మాత్రం పక్కాగా సినిమాలు చేస్తానంటున్నాడు. చిరంజీవి యాజ్ కు తగ్గట్టు.. బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు.. ఫన్ ఎలిమెంట్స్ తో కూడిన ఓ ఎక్స్ పెరిమెంట్ మూవీ చేస్తానని లేటెస్ట్ ఇంటర్యూలో అనిల్ రావిపూడి తెలిపాడు.

ఇక ఎన్టీఆర్ తో సినిమాకోసం గతంలోనే రెండు సిట్టింగ్స్ జరిగాయని.. అయితే ఇప్పుడు తారక్ లైనప్ మామూలుగా లేదు కాబట్టి.. తమ కాంబోలో సినిమాకోసం కొన్ని సంవత్సరాలు వెయిట్ చెయ్యాలన్నాడు. మరోవైపు.. మహేష్ తో సినిమా గురించి ప్రస్తావిస్తూ.. త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలకు మధ్య గ్యాప్ లో తన సినిమా ఉంటుందనడంలో ఎలాంటి వాస్తవం లేదని అనిల్ రావిపూడి అన్నాడు.

Related Posts