ఐకన్ స్టార్ అల్లు అర్జున్ రూటే సెపరేట్. ప్రస్తుతం ప్యాన్ ఇండియా లెవల్లో ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ఈ క్రెడిట్ కు కారణం తను మాత్రమే అని బలంగా నమ్ముతాడు. తనను తానో సెల్ఫ్ మేడ్ స్టార్ గా భావిస్తాడు. దాన్ని ఆత్మవిశ్వాసంగా చూసినప్పుడు అతనే కరెక్ట్ అనుకోవచ్చు. కానీ అంతా తెలిసిన వారికి మాత్రం అతను కొంతే కరెక్ట్ అనిపిస్తుంది. అతని పర్సనల్ మేటర్స్ పక్కన బెడితే సినిమాల పరంగా మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. అల వైకుంఠపురములో ఆడియోతో అంతా తనవైపు చూసేలా చేసుకున్నాడు. పుష్పతో ప్రపంచం తనవైపు చూసుకునేలా చేయగలిగాడు. డీ గ్లామర్ రోల్ లో మంచి నటన చూపించాడు. అతని మేనరిజమ్స్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. తగ్గేదే లే అంటూ చెప్పే డైలాగ్ సైతం అన్ని భాషల్లో రిజిస్టర్ అయిపోయింది. ఇంటర్నేషనల్ ఆడియన్స్ నుంచి ఆర్టిస్టుల వరకూ ఈ మూమెంట్ ను ఇమిటేట్ చేశారు. ప్రస్తుతం పుష్పకు రెండో భాగం చేస్తున్నాడు బన్నీ. అయితే లేటెస్ట్ గా సినిమాకు సంబంధం లేకుండా పాపులర్ అయిపోయాడు.


తెలుగులో చాలామంది స్టార్స్ చారిటీస్ చేస్తున్నారు. మహేష్ బాబు లాంటి వారైతే చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ చేయించడం.. రెండు గ్రామాలను దత్తత తీసుకోవడం లాంటివి చేస్తున్నాడు. కానీ ప్రచార పరంగా మాత్రం అంత ఆర్భాటం కనిపించదు. బట్.. లేటెస్ట్ గా అల్లు అర్జున్ కేరళలోని ఓ పేద ముస్లీం అమ్మాయి నర్సింగ్ విద్యకు అయ్యే ఖర్చును భరిస్తానని అక్కడి కలెక్టర్ కు చెప్పి.. ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. ఇవ్వడమే కాదు.. ఆ అమ్మాయి ఫస్ట్ ఇయర్ ఫీజ్ ను కూడా కట్టేశాడు. అయితే ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫేమ్ అయింది. తను ఎవరికీ చెప్పొద్దు అని చెప్పాడు అంటారు.. కానీ అక్కడి కలెక్టర్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అంటే క్షణాల్లో వైరల్ అయింది. ఇంతకు పదింతల సాయం చేసిన వారికి కూడా రానంత అప్లాజ్ ఇప్పుడు అల్లు అర్జున్ కు వస్తోంది.


అల్లు అర్జున కు కేరళలో తిరుగులేని మార్కెట్ ఉంది. ఫ్యాన్ బేస్ కూడా ఉంది. వాళ్లు ఇంకాస్త ముందడుగు వేసిఈ ప్రచార బాధ్యత తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఏదేమైనా అల్లు అర్జున్ రేంజ్ కు ఈ సాయం చాలా చిన్నది. కానీ ప్రచారం మాత్రం చాలా చాలా పెద్దగా జరిగింది.. జరుగుతోంది.