అన్ని ఏరియాస్ లో అదరహో

బాలకృష్ణ ‘భగవంత్ కేసరి‘ సినిమా చూసిన వాళ్లంతా ‘ఈ సినిమా షానా ఏండ్లు యాదుంటది.!‘ అంటూ ముక్తం కంఠంతో చెబుతున్నారు. దసరా కానుకగా నిన్న థియేటర్లలోకి వచ్చిన ‘భగవంత్ కేసరి‘ అన్ని ఏరియాలలోనూ అదరహో అనే వసూళ్లు సాధిస్తోంది. బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా గుంటూరు లో అయితే రికార్డ్ కలెక్షన్లను కొల్లగొట్టింది. గుంటూరులో మొదటి రోజు ఏకంగా 3 కోట్ల 8 లక్షల 67 వేల 57 రూపాయలు వసూలు చేసినట్టుగా అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించారు.

నైజాం ప్రాంతంలో ఈ చిత్రం తొలి రోజు 4.12 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది. ఓవర్సీస్ వసూళ్ల విషయంలో బాలయ్య వెనుకబడ్డాడు అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అయితే.. ‘భగవంత్ కేసరి‘ మాత్రం యు.ఎస్. లో దుమ్మురేపుతోంది. ఈ సినిమా ప్రీమియర్స్ కి అక్కడ రోరింగ్ రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే అక్కడ 6 లక్షల డాలర్ల వసూళ్లను అందుకున్న ఈ చిత్రం త్వరలోనే 1 మిలియన్ డాలర్లను కొల్లగొట్టబోతుంది. ఓవరాల్ గా డే 1 వరల్డ్ వైడ్ ‘భగవంత్ కేసరి‘ రూ.32.33 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు అధికారికంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్.

దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న బాలయ్య.. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద తనకు తిరుగులేదని మరోసారి ‘భగవంత్ కేసరి‘తో నిరూపిస్తున్నాడు. ‘అఖండ, వీరసింహారెడ్డి‘ విజయాల తర్వాత ‘భగవంత్ కేసరి‘తో హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడు. మరి.. లాంగ్ రన్ లో ‘భగవంత్ కేసరి‘ ఎలాంటి వసూళ్ల రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి.

Related Posts