ఆమిర్ ఖాన్.. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పిలుచుకునే హీరో. వైవిధ్యమైన కథలతో బలమైన ఇంపాక్ట్ చూపించే నటుడు. అందుకే అతనికి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. లాల్ సింగ్ చడ్డా అనే సినిమాతో వస్తున్నప్పుడు అతనిపై ఒక వర్గం వాళ్లు తీవ్రంగా వ్యతిరేకత చూపించారు. బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. అయినా దేశమంతా తిరిగి ప్రమోషన్స్ చేశాడు ఆమిర్. తెలుగులో చిరంజీవి ప్రమోట్ చేయడంతో ఇక్కడా అంచనాలు వచ్చాయి. ఫైనల్ గా ఈ గురువారం విడుదలైన లాల్ సింగ్ ఎలా ఉంది..? అంచనాలను అందుకుందా లేదా అనేది చూద్దాం.

లాల్ సింగ్ చడ్డా కథగా చూస్తే పుట్టుకతోనే మానసికంగా సరిగా ఎదగన లాల్ సింగ్ చడ్డా(ఆమిర్ ఖాన్) కు అంగ వైకల్యం కూడా ఉంటుంది. తన స్నేహితురాలు రూప(కరీనా కపూర్ ఖాన్) స్నేహంతో ఆ వైకల్యాన్ని జయిస్తాడు. చిన్నప్పుడు స్నేహితుల హేళనలను తప్పించేందుకు మొదలైన పరుగు అతని కెరీర్ గా మారి ఆర్మీలోకి వెళ్లేలా చేస్తుంది. పైగా ఈ సింగ్ గారి ఫ్యామిలీ అంతా యుద్ధాల్లోనే చనిపోయి ఉంటారు. ఆ కారణంగానే అతని తల్లి లాల్ ను కూడా ఆర్మీలోకి వెళ్లమని ప్రోత్సహిస్తుంది. ఆటల్లో నైపుణ్యం వల్ల సైన్యంలో చేరిన లాల్ కు అక్కడ బాలరాజు(బాలరాజు) పరిచయం అవుతాడు. అమ్మ, రూప తర్వాత బాలరాజు అంటే లాల్ కు బాగా ఇష్టం కలుగుతుంది. వీరు సైన్యంలో ఉండగానే జరిగిన కార్గిల్ వార్ లో బాలరాజు చనిపోతాడు. లాల్ గాయపడతాడు. ఆ కారణంగా ఆర్మీ నుంచి బయటకు వచ్చి బాలరాజు చెప్పిన బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. మరి ఆ బిజినెస్ ఏంటీ.. తను ప్రేమించిన రూప ఏమైపోతుంది..? చివరికి లాల్ జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది అనేది మిగతా కథ.

లాల్ సింగ్ చడ్డా.. అస్సలే మాత్రం ఆకట్టుకోలేకపోయిన సినిమా. ఏ దశలోనూ ఆసక్తిని కలిగించలేకపోయింది. మానసికంగా సరిగా ఎదగని బాలుడు నుంచి మొదలైన పాత్ర చివరి వరకూ అలాగే ఉంటుంది. ఇలాంటి పాత్రలపై చిన్నప్పటి నుంచే ఓ సింపతీ యాడ్ అయితే అతని చర్యలు చూస్తున్నవారికి అర్థం అవుతాయి. కానీ ఆ పాత్రపై సింపతీ రాకపోగా మాటిమాటికీ ఆమిర్ ‘ఊ’కొట్టడం, తల అటూ ఇటూ తిప్పడం చూస్తే చిరాకు అనిపిస్తుంది. అందుకే ఆ పాత్ర ఎమోషన్స్ తో ప్రేక్షకులు ఏ మాత్రం కనెక్ట్ కాలేరు. ఇలాంటి పాత్రలకు కష్టం వస్తే ప్రేక్షకుడు బాధపడాలి. అతని సంతోషాన్ని ఆడియన్ కూడా అనుభవించాలి. బట్ ఆ ఎమోషనల్ కనెక్షన్ బాల్యదశలోనే కట్ అవడంతో తెరపై జరుగుతున్న తతంగం అలా వెళ్లిపోతుందంతే. అసలు ఇలాంటి వ్యక్తిని ఆర్మీలో ఎలా తీసుకుంటారు అనేది పెద్ద ప్రశ్న అయితే.. అతను కార్గిల్ యుద్ధంలో పాల్గొని ఓ తీవ్రవాదిని తీసుకువస్తాడు.. అప్పటికే అతని కాల్లు ఇంజూర్ అవుతాయి. హాస్పిటల్ రెండు లెగ్స్ తొలగిస్తారు. అయితే అతన్ని జైలులో పెట్టుకుండా టెలీఫోన్ బూత్ పెట్టుకునేలా చేస్తారు. ఇంతకు మించిన సిల్లీ థింగ్ ఏముంటుంది. తర్వాత అతన్ని లాల్ కలిసి తన బిజినెస్ పార్టనర్ ను చేసుకుంటాడు. ఇదంతా ఓ ప్రహసనంలా సహనానికి పరీక్షలా సాగుతుంది తప్ప ఏ దశలోనూ ఆకట్టుకోలేదీ కథనం.

ఎంతో ఊహించుకున్న నాగ చైతన్య పాత్ర జూనియర్ ఆర్టిస్ట్ కు ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు తక్కువ అన్నట్టుంది. అసలే మాత్రం ప్రాధాన్యత లేని రోల్ ఇది. మరి ఎందుకు చేశాడో కానీ దీని వల్ల అతనికి మైనస్సే అవుతుంది. ఆమిర్ నటన పీకే సినిమాలో ఉన్నట్టుగానే ఉంది. దీంతో మరోసారి అదే యాక్టింగ్ చూడలేకపోతాం. కరీనా కపూర్ పాత్ర, నటన బావున్నాయి. మిగతా రోల్స్ లో ఎవరూ పెద్దగా రిజిస్టర్ కారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ బావున్నాయి. దర్శకత్వ పరంగా అద్వైత్ కంటే ఆమిర్ నే అనాలేమో. మొత్తంగా బాలీవుడ్ కు మరో బ్యాడ్ న్యూస్.

, , , , , , , ,