ఆస్కార్ రేసులో ఉన్న సినిమాల పేర్లు అడిగితే తెలుగు నుంచి ట్రిపుల్ ఆర్‌తో పాటు శ్యామ్‌సింగ‌రాయ్ సినిమా గురించి కూడా చెప్తారు సీరియ‌స్ ఫాలోయ‌ర్స్. శ్యామ్ సింగ‌రాయ్‌లో షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ గా న‌టించింది కృతిశెట్టి. ఇవాళ మ‌హేష్‌బాబు చేతుల మీదుగా రిలీజైన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలిలోనూ సినిమాల్లో న‌టించే హీరోయిన్‌గా క‌నిపించింది.ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో కృతి శెట్టి కేర‌క్ట‌ర్ పేరు అలేఖ్య‌. ఆమె డాక్ట‌ర్‌. సుధీర్‌బాబు డైర‌క్ట‌ర్‌. అత‌ను అడిగాడు క‌దా అని సినిమాల్లో న‌టించ‌డానికి ఒప్పుకుంటుంది అలేఖ్య‌. అయితే సినిమా ఇండ‌స్ట్రీ మీద అత్యంత నీచ‌మైన ఒపీనియ‌న్ ఉంటుంది అలేఖ్య ఫ్యామిలీకి. వాళ్ల‌కు తెలియ‌కుండా సినిమాలో న‌టిస్తుంటుంది అలేఖ్య‌.

అలాంటిది ఒక రోజు వాళ్ల నాన్న‌కు విష‌యం తెలిసి సెట్లోనే కొట్టి ఇంటికి తీసుకెళ్తాడు. ఆమె సినిమాల్లో న‌టించ‌కూడ‌ద‌ని ష‌ర‌తు విధిస్తాడు. అస‌లే మూడీ అలేఖ్య, ఇలాంటి ఘట‌న జ‌ర‌గ‌డంతో ఇంకా డిప్రెస్ అవుతుంది. అప్ప‌టికే ఆమెతో ప్రేమ‌లో ప‌డి ఉంటాడు సుధీర్ బాబు. త‌న ఫ్యామిలీని కాద‌ని అలేఖ్య న‌ట‌న‌కు ఓకే చెప్పిందా? సుధీర్ తీసిన సినిమాలో న‌టించిందా? అనేది బ్యాల‌న్స్ స్టోరీ.ట్రైల‌ర్‌ని బ‌ట్టి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి క‌థ ఇంతే. కాక‌పోతే సినిమాల్లో సినిమా స‌న్నివేశాల‌ను బాగా తీస్తార‌నే పేరున్న ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ఫుల్ నెరేష‌న్ ఎంత బాగా చేశార‌న్న‌ది సిల్వ‌ర్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

, , , , ,