న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ మంచి స్పీడుమీదున్నారు. ఇప్పుడు గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో త‌న 107వ‌ సినిమా చేస్తోన్న సంగతి విదిత‌మే. ఈ సినిమా పూర్తి కాక ముందే త‌న 108వ సినిమాను అనౌన్స్ చేశారు నంద‌మూరి క‌థానాయ‌కుడు. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ను తెర‌కెక్కించ‌టంలో దిట్ట అయిన అనిల్ రావిపూడి ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు. సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. NBK 107 షూటింగ్ పూర్త‌వ‌గానే ఈ సినిమా సెట్స్‌లోకి వెళుతుంద‌ని స‌మాచారం. మేక‌ర్స్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉన్నారు.

సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు NBK 108లో విల‌న్‌గా ఓ కోలీవుడ్ సీనియ‌ర్ స్టార్‌ను నిర్మాత‌లు విల‌న్‌గా న‌టించాల‌ని సంప్ర‌దించార‌ట‌. అందుకు ఆయ‌న కూడా ఒప్పుకున్నారు. అయితే భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేశార‌ట‌. దీంతో నిర్మాత‌లు ఆలోచ‌న‌లో ప‌డి బ‌డ్జెట్ లెక్క‌లు వేసుకుని, సద‌రు సీనియ‌ర్ స్టార్ విష‌యంలో వెన‌క్కి త‌గ్గార‌ట‌. ఇంత‌కీ బాల‌య్య నిర్మాత‌ల‌ను అలా ఆలోచ‌న‌లో ప‌డేసిన కోలీవుడ్ స్టార్ ఎవ‌రో కాదు.. అర‌వింద్ స్వామి. సెకండ్ ఇన్సింగ్స్‌లో హీరోగానే కాకుండా, విల‌న్‌గానూ అర‌వింద స్వామి న‌టిస్తున్నారు. తెలుగులో రామ్ చ‌ర‌ణ్ హీరోగా చేసిన ధృవ సినిమాలోనూ ఆయ‌న ప్ర‌తి నాయ‌కుడిగా న‌టించారు. మ‌ళ్లీ ఇప్పుడు చేయాల‌ని నిర్మాత‌లు అడిగితే క‌ళ్లు చెదిరే రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసి వారికి షాకిచ్చార‌ని స‌మాచారం.

, , , , , , , ,