ad

కీర్తి సురేష్‌.. మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తెలుగులో ముందుగా ఓ అనామక చిత్రంతో తన జర్నీ ప్రారంభం అయినా ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. తర్వాత వచ్చిన నేను శైలజతో పాప ఓవర్ నైట్ ఫేమ్ అయిపోయింది. ఆ సినిమాలో తన నటనతో పాటు క్యూట్ లుక్స్ తోనూ తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అటుపై వచ్చిన నేను లోకల్ తో మరో హిట్ అందుకుంది. తెలుగుతో పాటు అటు తమిళ్ లో కూడా వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపపోయింది. మహానటి చిత్రంతో ఓ రేంజ్ నటన చూపించి ఏకంగా బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. అయితే ఈ సినిమా తన కెరీర్ కు పెద్ద అవరోధంగా మారింది. ఈ మూవీ కోసంఅంతకు ముందే ఒప్పుకున్న కొన్ని తమిళ్ సినిమాలను హోల్డ్ లో పెట్టింది. మహానటి తర్వాత వచ్చిన ఆ సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ గా నిలిచాయి. మరోవైపు ఓటిటిల్లోనూ దూకుడు చూపించింది. అవన్నీ డిజాస్టర్ గా నిలవడంతో పాటు తను ఇక అమ్మ, చెల్లి పాత్రలకు షిఫ్‌ట్ అయిపోయినట్టే అనిపించేలా కనిపించాయి. ఓ దశలో ఇక కీర్తి సురేష్‌ ను ఎవరూ పట్టించుకోరు అని ఖచ్చితంగా వినిపించింది. అందుకు ప్రధాన కారణం తను ఎంచుకున్న కథలే.
అయితే ఏ సినిమా చేసినా కీర్తి సురేష్ గ్లామర్ పరంగా ఎప్పుడూ హద్దులు దాటలేదు.

తనతో పాటు వచ్చిన రష్మిక మందన్నా, పూజాహెగ్డే వంటి వారు హాట్ హాట్ గా రెచ్చిపోయినా తను మాత్రం మినిమం స్కిన్ షో కూడా చేయలేదు. పెద్ద హీరోలు, దర్శకులు పట్టించుకోకపోడానికి ఇదీ ఓ కారణమే అనే మాటలూ అప్పట్లో వినిపించాయి. గ్లామర్ ఫీల్డ్ లో ఉంటూ మడికట్టుకుని కూర్చుంటే మరీ ఎక్కువ సినిమాలు కూడా రావు. పైగా కీర్తి తల్లి మేనక కూడా ఒకప్పుడు హీరోయిన్. తనూ గ్లామర్ పాత్రలు చేసింది. మరి కూతురు విషయంలో ఎందుకు హద్దులు పెట్టిందో కానీ.. అది చివరికి తన కెరీర్ కే ఎసరు పెట్టింది. దీంతో అమ్మడికి కనువిప్పు కలిగినట్టుంది. అందుకే మెల్లగా గ్లామర్ గేట్స్ ఎత్తేస్తోంది. రీసెంట్ గా వచ్చిన సర్కారువారి పాటలో కూడా ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత గ్లామరస్ గా కనిపించింది. స్కిన్ షో చేసింది అని చెప్పలేం కానీ.. ఓ రకంగా అందుకు సిద్ధమైనట్టుగా చెప్పకనే చెప్పింది.ఇక లేటెస్ట్ గా ఓ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ హాట్ హాట్ గా కనిపిస్తూ హీట్ పెంచేస్తోంది. ఈ తరహా హాట్ లుక్ తో కీర్తి ఇంతకు ముందెప్పుడూ కనిపించలేదు కూడా. మరి తనూ ఇతరుల రూట్ లోకి రాకపోతే ఇక సినిమాలు రావు అన్న తత్వం బోధపడిందో లేక ఇంకేదైనా కారణం ఉందో కానీ.. కీర్తి సురేష్ కూడా గ్లామర్ డోస్ పెంచేస్తోందని చెప్పొచ్చు. అయినా ఒకప్పుడు సౌందర్యకే తప్పలేదు. కెరీర్ చివర్లో సౌందర్య కూడా ఇలాగే డోస్ పెంచేసింది.

, , , ,