Advertisement
 చిన్న హీరోలే ముద్దంటోన్న  కీర్తి సురేష్
Latest Movies Tollywood

 చిన్న హీరోలే ముద్దంటోన్న  కీర్తి సురేష్

Advertisement

అరంగేట్రం టైమ్ లో టాప్ హీరోయిన్ అవుతుందనిపించుకున్న బ్యూటీ కీర్తి సురేష్. ఆ స్థాయిలోనే తెలుగుతో పాటు తమిళ్ లోనూ టాప్ హీరోల సరసన ఆఫర్స్ వచ్చాయి. తన బ్యాడ్ లక్ అన్నీ పోయాయి. మరోవైపు మహానటి సినిమాతో తనలోని నటిని కూడా చూపించి ఏకంగా నేషనల్ అవార్డ్ అందుకుంది. అయినా కీర్తి సురేష్ సినిమాలకు సంబంధించి పెద్దగా క్రేజ్ రాలేదనే చెప్పాలి. ఇలాంటి టైమ్ లో కాస్త మంచి కథలు సెలెక్ట్ చేసుకోవాల్సింది పోయి.. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలంటూ ఆ మధ్య పెంగ్విన్ చేసింది. అదీ డిజాస్టర్ అయింది. తెలుగులో చేసిన మిస్ ఇండియా పోయింది. రంగ్ దే ఫర్వాలేదనిపించుకుందంతే. అన్నాత్తేలో చెల్లి పాత్ర చేయడంతో ఇమేజ్ కూడా కాస్త డ్యామేజ్ అయిందనుకున్నారు చాలామంది. బట్ ప్రస్తుతం తను నటించిన గుడ్ లక్ సఖి విడుదల కావాల్సి ఉంది. చిరంజీవితోనూ భోళా శంకర్ లో చెల్లిగా నటిస్తోంది. ఇక  మహేష్ బాబుతో చేస్తోన్న సర్కారువారి పాట రిజల్ట్ హీరోయిన్ గా కీర్తి సురేష్ ఫేట్ ను డిసైడ్ చేస్తుందనుకోవచ్చు.
మరి టాప్ హీరోయిన్ అనే ట్యాగ్ తనకు అవసరం లేదు అనుకుందో ఏమో.. అమ్మడు ఈ మధ్య ఇతర భాషల్లో చిన్న హీరోలతోనే సినిమాలు చేస్తోంది. లేటెస్ట్ గా తమిళనాడు ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సరసన ఓ సినిమాకు సైన్ చేసింది కీర్తి సురేష్. ఉదయ్ నిధికి హీరోగా ఇంత వరకూ స్టార్డమ్ ఏం రాలేదు. అయినా చీఫ్ మినిస్టర్ తనయుడు కాబట్టి చేసిందా లేక కథ నచ్చిందా అనేది సినిమా వస్తే కానీ తెలియదు.
మరోవైపు మళయాలంలో కూడా మరో చిన్న స్టార్ టోవినో థామస్ తో నటిస్తోంది. అలాగే తమిళ్ లో మరో హీరోయిన్ సెంట్రిక్ మూవీ కూడా ఉంది. ఏదేమైనా కీర్తి సురేష్ సినిమాల వరస చూస్తోంటే ఏ ఆఫర్ వస్తే అది చేస్తోంది తప్ప ఓ ప్లానింగ్ తో ఉన్నట్టు కనిపించడం లేదనే కమెంట్స్ వస్తున్నాయి. నిజంగా తనకు పెద్ద హీరోయిన్ కావాలని లేకుంటే చేసేదేం లేదు. కానీ ఇలా ఓ వైపు మహేష్ లాంటి టాప్ స్టార్ తో యాక్ట్ చేస్తూ మళ్లీ ఉదయనిధి, టోవినోథామస్ అంటే తనకే ఇబ్బంది.

 

Advertisement